ప్లాన్ ప్రకారమే ఫస్ట్ బాల్‌కు సిక్స్.. వివాదాస్పద రీతిలో ఔటైనందుకు బాధ లేదు: సూర్యకుమార్ యాదవ్

అహ్మదాబాద్: అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి ఔటైనందుకు తనకు ఎలాంటి బాధలేదని టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవన్నాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరుస బౌండరీలతో జోరు కనబర్చిన సూర్య థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి వెనుదిరిగాల్సి వచ్చింది. దాంతో అతను ఔటైన విధానంపై తీవ్ర దుమారం రేగింది.

అదృష్టంగా భావిస్తున్నా..
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. ఆడడం ఒక్కటే మన పనని, ఔట్‌కు సంబంధించిన నిర్ణయాలు తమ చేతిలో ఉండవని తెలిపాడు. 'నా అవుట్ విషయం పక్కనబెడితే మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌తో సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌లో మూడో స్థానంలో ఆడే నేను టీమిండియా తరపున కూడా అదే స్థానంలో బరిలోకి దిగడం అదృష్టంగా భావిస్తున్నా. నా ప్రణాళిక ప్రకారమే నా ఆట కొనసాగింది.

అ ప్లాన్‌తోనే సిక్స్..
గత రెండు మూడు ఐపీఎల్ సీజన్లుగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఆడిన అనుభవం నాకుంది. అతను ఆడిన మ్యాచ్‌లను కొన్నింటిని పరిశీలిస్తే.. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మెన్‌కు ఫస్ట్ షార్ట్ పిచ్ బంతిని సంధించడం అతని వ్యూహమని అర్థమైంది. దాంతో.. నేను కూడా షార్ట్ పిచ్‌ని ఆడేందుకు ప్లాన్ చేసుకున్నా. ఆ క్రమంలోనే తొలి బంతిని భారీ సిక్సర్ కొట్టాను.

ఎలాంటి బాధ లేదు..
ఇక ఔట్ విషయం నా చేతుల్లో లేదు కాబట్టి నేనేం నిరుత్సాహానికి గురవ్వలేదు. ఆడడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.. దాన్ని అయితే కంట్రోల్ చేయగలను కానీ అంపైర్ నిర్ణయాలను కంట్రోల్ చేయలేము. ఏ ఆటగాడైనా సరే ఫీల్డ్ అంపైర్ లేదా థర్ఢ్ అంపైర్ తుది నిర్ణయానికి కట్టుబడాల్సిందే. ఇదేమి నేను పెద్ద విషయంగా భావించడం లేదు.'అని చెప్పుకొచ్చాడు.

బంతి నేలకు తాకినా..
సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో నటరాజ్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు. అయితే బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనబడుతున్నా అంపైర్ ఆధారం లేదనడం వివాదాస్పదమైంది.
తెలియనప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఎలా ఔట్ ఇస్తాడు: విరాట్ కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications