Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేడు(మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. టీ20 సిరీస్ లో ఎదురైన ఘోర పరాజయానికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ రెండు జట్ల మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ముఖాముఖి రికార్డు
వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టుదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య మొత్తం 110 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. వాటిలో టీమిండియా 61 మ్యాచ్‌లు గెలిచింది. మరోవైపు ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌లు గెలిచింది. 2 మ్యాచ్‌లు టై కాగా, మూడు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు. ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు భారత్ ఆడిన మొత్తం 44 వన్డే మ్యాచ్‌లలో, 18 మ్యాచ్‌లు గెలవగా.. 23 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ టై కాగా, 2 మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు.

India vs England 1st ODI Head to Head Records Match Timing and India Predicted Playing XI

వన్డేలలో బలంగా ఉన్న టీమిండియా
టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుపై భారత బ్యాటర్ల ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచింది. అందువల్ల వన్డేలలో తమ బ్యాటర్ల నుంచి టీమిండియా మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రాకతో వన్డేలలో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత సమతుల్యంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌ను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మోయనున్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ పాత్రలు పోషించనున్నారు.

ఈ గెలుపు క్రెడిట్ వారిదే.. థ్యాంక్యూ సార్: హర్మన్‌ప్రీత్ కౌర్

ఈ గెలుపు క్రెడిట్ వారిదే.. థ్యాంక్యూ సార్: హర్మన్‌ప్రీత్ కౌర్

అందరి దృష్టి జస్ప్రీత్ బుమ్రా పైనే..
ఈ వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. బుమ్రాకు మద్దతుగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్‌లను ఎంపిక చేశారు. గాయం కారణంగా హర్షిత్ రాణా ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. స్పిన్ విభాగాన్ని కుల్దీప్ యాదవ్ పర్యవేక్షిస్తాడని భావిస్తున్నారు, కాగా రవి బిష్ణోయ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌లో భాగం కావడం లేదు.

Story first published: Tuesday, July 14, 2026, 9:44 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+