ఈ గెలుపు క్రెడిట్ వారిదే.. థ్యాంక్యూ సార్: హర్మన్‌ప్రీత్ కౌర్
ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సమష్టిగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 270 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
మహిళల క్రికెట్ చరిత్రలోనే లార్డ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఈ గెలుపు క్రెడిట్‌ను సపోర్ట్ స్టాఫ్‌కు ఇచ్చింది. తమ హెడ్ కోచ్ అమోల్ ముజుందార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వారి సూచనలతోనే ఈ మ్యాచ్‌లో విజయం సాధించామని చెప్పుకొచ్చింది.

థ్యాంక్యూ సార్..
'నేను ఊహించిన దానికంటే ఈ విజయం అద్భుతంగా ఉందా? అంటే అలా అనుకోను. దేవుడు మనకంటే గొప్ప రచయిత. ఆయనే ఈ విజయాన్ని అద్భుతంగా లిఖించారు. మా ఓపెనర్లు ఎప్పుడూ మాకు బలమే. తొలి ఇన్నింగ్స్‌లో వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
ఈ విజయం మా కష్టానికి ప్రతిఫలం మాత్రమే. మా సపోర్ట్ స్టాఫ్‌కు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. మ్యాచ్ సాగుతున్న తీరును వారు ముందే పసిగట్టారు. ప్రతీ క్షణం మాకు ఫీడ్ బ్యాక్ ఇస్తూ ముందుకు నడిపించారు. ఈ మ్యాచ్‌తో పాటు గత టెస్ట్ మ్యాచ్‌ల్లో మేం ఆడిన తీరుకు మా హెడ్ కోచ్ అమోల్ సార్‌కు, ఆయన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
మరో 10 మ్యాచ్‌లు ఆడాలని ఉంది..
ఈ మ్యాచ్‌కు ముందు కొన్ని సిరీస్‌లు మాకు సానుకూలంగా సాగలేదు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా మా సపోర్ట్ స్టాఫ్‌దే. ఈ వేసవి కాలంలో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. కానీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో బలంగా పుంజుకున్నాం. యస్తిక భాటియా నైపుణ్యం తెలిసే ఆమెను తుది జట్టులోకి తీసుకున్నాం. ఆమె ఆడిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా మా టీమ్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకునే విషయంలో ఒక జట్టుగా మేం చాలా కష్టపడుతున్నాం. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. ఐకానిక్ లార్డ్స్‌లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ వేదికగా మ్యాచ్‌ను ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని మ్యాచ్‌లు ఆడుతామని ఆశిస్తున్నా. అలాగే మాకు మరో పది టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించాలని, మేం ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

