IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్
పిచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడం, బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్ట్‌లో తమ పతనాన్ని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ తెలిపింది. ఈ మ్యాచ్‌కు సిద్దమయ్యేందుకు తమకు తగిన సమయం దొరకలేదని, కానీ ఈ పరాజయానికి దాన్ని సాకుగా చూపలేమని అభిప్రాయపడింది.
క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రతిష్టాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.మహిళల క్రికెట్ చరిత్రలోనే లార్డ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.

కండిషన్స్‌కు అలవాటు పడలేకపోయాం..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నాట్ సివర్ బ్రంట్.. భారత్ తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిందని అంగీకరించింది. 'తొలి రోజు ఆట ఉదయం పిచ్ కండిషన్స్‌కు త్వరగా అలవాటు పడలేకపోయాం. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాం. కానీ ఒక్కసారి లైన్ అండ్ లెంగ్త్ దొరికిన తర్వాత తిరిగి మ్యాచ్‌పై పట్టు సాధించాం. కానీ బ్యాటింగ్‌లో కీలకమైన భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయాం. దాంతో ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడానికి పోరాడాల్సి వచ్చింది.
మా ఆటగాళ్లు పలు దశల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా లారెన్ బెల్, వాంగ్, ఎక్లీస్లోన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలోనే నేను తొలి టెస్ట్ మ్యాచ్ ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చింది. అయితే మేం చాలా విషయాల్లో మెరుగవ్వాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం తప్పుడు నిర్ణయమని నేను భావించడం లేదు. జట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎలాంటి విచారం లేదు. ఈ మ్యాచ్‌లో కొన్ని సమయాల్లో మేం ఆధిపత్యం చెలాయించాం. కానీ దాన్ని ఎక్కువ సేపు కొనసాగించలేకపోయాం.
మా ఓటమికి అది సాకు కాదు..
టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మాకు తగిన సమయం దొరకలేదు. కానీ ఈ ఓటమికి దాన్ని సాకుగా చూపలేం. ప్రొఫెషల్ క్రికెటర్లుగా ఈ బిజీ షెడ్యూల్‌కు మేం ఒకే చెప్పాం. కాబట్టి ఎప్పుడూ సిద్దంగా ఉండాలి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీని ఆస్వాదించాను. ఇది మాకు భావోద్వేగపూరితమైన మ్యాచ్. హీథర్ నైట్, టామీలకు ఇది చివరి మ్యాచ్. వారు లేకుండా ఆడాలనే ఆలోచనే వింతగా అనిపిస్తుంది.
హీథర్ నైట్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. నైట్, బ్యూమౌంట్ టామీలు మాకు కీలకమైన ఆటగాళ్లు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. వచ్చే సమ్మర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు బాగా సన్నదమవుతాం. ఈ జట్టుతో కలిసి టెస్ట్ క్రికెట్‌లో గడిపిన ప్రతీ క్షణం గుర్తుంచుకోదగినది, గర్వించదగినది.'అని నాట్ సివర్ బ్రంట్ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

