Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్ గెలిచేనా..?

వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. నేడు(గురువారం) రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే నిర్ణయాత్మక నాలుగో టీ20లో ఇంగ్లండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కీలకం. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే కెప్టెన్‌గా అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది.

IND vs ENG: వైభవ్ ఔట్.. సంజూ ఇన్! ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: వైభవ్ ఔట్.. సంజూ ఇన్! ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

20 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇలా వరుసగా 5 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్కటి గెలవకపోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే అయ్యర్‌కు ఈ గెలుపు అనివార్యమైంది. అయితే ఈ మ్యాచ్ జరిగే బ్రిస్టల్.. టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ ఆడిన గత నాలుగు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్‌కు తొలి విజయం దక్కుతుందో లేదో చూడాలి.

IND vs ENG 4th T20 Can Shreyas Iyer Secure His Maiden Win at India s Lucky Ground in Bristol
Photo Credit: BCCI(X)

బ్యాటింగ్ ప్రధాన సమస్య..

అయ్యర్‌సేనకు బ్యాటింగ్‌ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మూడో టీ20లో భారత చెత్త ప్రదర్శన కనబర్చింది. 202 పరుగుల లక్ష్య ఛేదనలో 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. 125 పరుగుల తేడాతో చిత్తయ్యింది. పరుగుల పరంగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇదే ఘోర పరాజయం. ఈ మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. టాప్ స్కోర్ 13. భారత్ బ్యాటింగ్ ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ ద్వయాన్ని భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోతున్నారు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా ఇతర బ్యాటర్ల తరహాలోనే తడబడుతున్నాడు. వైభవ్ స్థానంలో తిరిగి సంజూ శాంసన్‌ను ఆడిస్తారా? లేదా? అనేది చూడాలి. తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తే.. శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్ షెడ్జే, అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగవచ్చు. తుది జట్టు ఎలా ఉన్నా.. టీమిండియా బ్యాటింగ్ విభాగం రాణించడంపైనే విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

పటిష్టంగా ఇంగ్లండ్..

మరోవైపు వరుస విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్‌కు ఎలాంటి సమస్యలు లేవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పుంజుకొని ఆడటం ఆ జట్టు ప్రధాన బలం. బ్రిస్టల్ మైదానంలో సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి.

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

తుది జట్లు(అంచనా)

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరణ్, విల్ జాక్స్, డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.

Story first published: Thursday, July 9, 2026, 8:32 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+