పృథ్వీషాకు మరో చాన్స్ ఇవ్వాలి.. అండగా ఉన్నామనే భరోసా కల్పించాలి: ఆసీస్ మాజీ క్రికెటర్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఫస్ట్ డే/నైట్ టెస్ట్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 36 పరుగులకే పరిమితమై పరువు తీసుకుంది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండెంకల స్కోర్ చేయలేదు. దాంతో ఆతిథ్య ఆసీస్ 8 వికెట్లతో ఘనవిజాయాన్నందుకొని నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఘోర ఓటమి నేపథ్యంలో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4 తో షా దారుణంగా విఫలమ్వడంతోనే భారత్ ఓటమిపాలైందని మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి మ్యాచ్‌కు అతనిపై వేటు వేయాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ మాత్రం పృథ్వీ షాకు అండగా నిలిచాడు.

మరో చాన్స్ ఇవ్వాలి..
అతనికి మరో అవకాశం ఇవ్వాలని భారత టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఈ ఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ ఫోతో మాట్లాడుతూ.. ఒక్క టెస్ట్‌లో విఫలమైనంత మాత్రానా అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని, ఆసీస్ టీమ్‌లో జో బర్న్స్ కూడా ఇలానే విఫలమై టీమ్ మేనేజ్‌మెంట్ సహకారంతో గాడిలో పడ్డాడని గుర్తు చేశాడు. పృథ్వీషాకు కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా ఉందనే భరోసా కల్పించాలన్నాడు. అలాగే ఫస్ట్ టెస్ట్‌లో అతనొక్కడే విఫలమవ్వలేదని, ఆ పిచ్, ప్రత్యర్థి బౌలింగ్ అలాంటిదని, దానికి పృథ్వీని ఒక్కడినే నిందించడం సరికాదన్నాడు. అంతేకాకుండా తదుపరి మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్ మైదానం అతనికి సరిగ్గా సరిపోతుందన్నాడు.

పిచ్‌ను కూడా చూడాలి..
‘పృథ్వీషాపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచాలి. అతను దారుణంగా విఫలమైన మాట వాస్తవమే. కానీ అది ఒక టెస్ట్ మ్యాచే. అంతేకాకుండా కఠిన పిచ్‌తో పాటు ప్రత్యర్థి అద్భుత బౌలింగ్ వల్లే విఫలమయ్యాడనే విషయం కూడా గుర్తించాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆసీస్ ఓపెనర్ జోబర్న్స్ యావరేజ్ 7 పరుగులకంటే తక్కువగా ఉంది. కానీ ఆ టీమ్ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైనా.. మెళ్లగా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసాడు. మునపటి లయను అందుకున్నాడు.

ఆ భరోసా ఇవ్వాలి..
పృథ్వీషాపై కూడా నమ్మకం ఉంచితే తనేంటో తెలసుకుంటాడు. మేం అండగా ఉన్నామనే భరోసా అతనికిస్తే చాలు. మెల్‌బోర్న్ పిచ్ అతనికి సరిగ్గా సరిపోతుంది. గత మ్యాచ్ మాదిరి పేస్, బౌన్స్ అక్కడ ఉండదు. అద్భుతమైన ఆటగాడని పృథ్వీ షా బాక్సింగ్ డే టెస్ట్‌లో రాణించగలడు. పృథ్వీ షాకు అవకాశమిస్తే ఇతర ఆటగాళ్లకు కూడా కఠిన సమయంలో కూడా అండగా ఉంటామనే ఓ సందేశం ఇచ్చినట్లు అవుతోంది. తదుపరి మ్యాచ్‌లో సెలెక్టర్లు షా అవకాశమివ్వాలని కోరుతున్నా'అని మైఖెల్ హస్సీ చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications