
క్లారిటీ లేదు..
రోహిత్ గాయం వ్యవహారం ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని విరాట్ కోహ్లీ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీరి మధ్య విభేదాలు నిజమే అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్‌లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీకి బాధ్యత లేదా?
ఇక రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతోనే ఆస్ట్రేలియా వెళ్లలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. తండ్రి కరోనా బారిన పడటంతో అతను ఐపీఎల్ ముగిసిన వెంటనే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్‌కు తిరిగొచ్చాడన్నాడు. పైగా రోహిత్ తండ్రి హార్ట్ పెషెంట్ అని, ఈ విషయం కోహ్లీకి తెలియదన్నాడు. అయితే ఓ కెప్టెన్‌గా తన డిప్యూటీకి ఏమైందనే విషయం తెలుసుకోలేడా? అనే వాదన తెరపైకి వచ్చింది. కమ్యూనికేషన్ విస్తరించిన ఈ యుగంలో కూడా రోహిత్‌కు ఏమైందో తెలియదని విరాట్ చెప్పడం విచారకరమని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అసహనం వ్యక్తం చేశాడు.

విరాట్ తెలుసుకోవచ్చు కదా..
‘అందరిలానే విరాట్ మాటలు విని ఆశ్చర్యపోయా.. బాధపడ్డా. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. రోహిత్ శర్మ గాయం గురించి తనకేం తెలియదని కోహ్లీ అంటున్నాడు. ఈ మాటలు నన్ను బాధపెట్టాయి. సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో ఇలా జరగాల్సింది కాదు. సంబంధిత వ్యక్తులు సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి.'అని నెహ్రా పేర్కొన్నాడు. బీసీసీఐ సమాచారం ఇవ్వకపోయినా.. కోహ్లీకి ఏమైందని, అతనైనా నేరుగా రోహిత్‌తో మాట్లాడవచ్చు కదా? అని మరికొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఓ కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య ఫోన్ చేసుకునే వాతావరణం లేకపోవడం జట్టుకు ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు.

టెస్ట్ సిరీస్‌కు డౌట్..
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఫస్ట్ రెండు టెస్ట్‌లకు దూరమైన రోహిత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లు ఆడటంపై కూడా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న రోహిత్ ఫిట్‌గా లేడని వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ ప్రకటించింది. క్వారంటైన్ నిబంధనలను పరిశీలిస్తే ఆఖరి రెండు టెస్టులు కూడా ఆడటం అనుమానంగా మారింది. అసలు రోహిత్ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. మరోవైపు రోహిత్, విరాట్ వైరం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications

India vs Australia: ఫస్ట్ వన్డేకు ‘స్టాప్ అదానీ' ఉద్యమ సెగ.. మైదానంలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు! (వీడియో)