అతనిలా భారత బౌలర్లు నన్ను ఔట్ చేయలేరు: స్టీవ్ స్మిత్

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సుమారు మూడు నెలల ఈ సుధీర్ఘ పర్యటనలో కోహ్లీ సేన.. ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. కరోనా అనంతరం భారత్‌కు ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆసక్తికర పోరు నవంబర్ 27 నుంచి షురూ కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా భారత్‌కు ధీటుగా సిద్దమవుతుంది.
అయితే ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్‌లా షార్ట్ పిచ్ బంతులతో తనను బోల్తా కొట్టించాలనుకుంటే అది భారత బౌలర్ల పొరపాటేనని ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. ఈ సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ ఆసీస్ మాజీ కెప్టెన్.. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్దమయ్యానన్నాడు.

బౌలర్ల నాటకాలు నడవవు..
‘నా ముందు బౌలర్ల నాటకాలు నడవవు. నేను పరిస్థితులకు తగ్గట్లు ఆడుతాను. ప్రత్యర్థులు నన్ను ఔట్ చేయడానికి పన్నిన వ్యూహాలను తిప్పుకొడుతాను. బౌన్సర్లతో నన్ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి జట్లు ప్రయత్నిస్తాయి. గతంలో కొన్నిసార్లు షార్ట్ పిచ్ బంతులకు నేను ఔటయ్యాను. కానీ నా కెరీర్‌లో అలాంటి బంతుల్ని ఎన్నో ఎదుర్కొన్నాను. బౌన్సర్లు నన్ను ఒత్తిడికి గురిచేయలేవు. ' అని స్మిత్ తెలిపాడు.

వాగ్నర్ స్పెషల్..
న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో స్మిత్‌ను కివీస్ పేసర్ వాగ్నర్ షార్ట్‌పిచ్ బంతులతో నాలుగు సార్లు ఔట్ చేశాడు. అతని శరీరానికి బంతులు తగిలేట్లుగా వరుసగా బౌన్సర్లు విసురుతూ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న స్మిత్ .. ''కొన్ని ప్రత్యర్థి జట్లు ఔట్ చేయడానికి వాగ్నర్‌లా షార్ట్ పిచ్ బంతులతో ప్రయత్నించాయి. అయితే వాగ్నర్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. వేగంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ బంతులు సంధిస్తాడు. అలా అని అందరూ అతన్ని అనుసరిస్తే నేను తిప్పికొడుతా' అని స్మిత్ పేర్కొన్నాడు.

బుమ్రా, షమీ..
టీమిండియా టెస్టు జట్టులో పేసర్లు బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. గాయం నుంచి కోలుకున్నాక ఇషాంత్ శర్మ కూడా జట్టులోకి వస్తాడు. వీళ్లని స్మిత్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. ఇక గతేడాది ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించిన భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టింది. అయితే అప్పుడు వార్నర్, స్మిత్ లేకపోవడం భారత్ పని సులువైంది. కానీ ఈసారి వాళ్లు జట్టులో ఉండటం, విరాట్ టెస్ట్‌లకు దూరమవుతుండటం భారత్‌కు ప్రతికూలంగా మారాయి.
మా గుండెల్లోనే ఉన్నావ్ బాసూ.. డీన్ జోన్స్‌కు పీఎస్‌ఎల్ ఆటగాళ్ల ఘన నివాళి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications