For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు: సౌరవ్ గంగూలీ

India vs Australia: Sourav Ganguly says Rohit Sharma is still just 70 per cent fit
Ind Vs Aus 2020 : Ganguly On Rohit Sharma Chances In Team India Squad For Australia Tour | Oneindia

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. 70 శాతం మాత్రమే ఫిట్‌నెస్ సాధించాడని, ఆకారణంగానే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేయలేదన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడ్డ రోహిత్.. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని తొడ కండరాల గాయం తీవ్రమైందని, 2-3 వారాల విశ్రాంతి అవసరమని టీమిండియా ఫిజియో ఇచ్చిన రిపోర్ట్‌తో సెలెక్షన్ కమిటీ తొలుత రోహిత్‌ను ఆసీస్ టూర్ మొత్తానికి ఎంపిక చేయలేదు.

 రోహిత్ గాయంపై దుమారం

రోహిత్ గాయంపై దుమారం

కానీ రోహిత్ ఆ మరుసటి లీగ్ మ్యాచ్‌ల్లో ఆడటంతో సెలెక్షన్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. టీ20, వన్డే సిరీస్‌లకు మాత్రం విశ్రాంతినిచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హిట్ మ్యాన్‌ను పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకోవడంతోనే హుటాహుటిన రోహిత్‌ను ఎంపిక చేశారా? అని అభిమానులు బీసీసీఐని నిలదీశారు.

70 శాతం మాత్రమే ఫిట్..

70 శాతం మాత్రమే ఫిట్..

ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీని ప్రశ్నించగా.. రోహిత్ పూర్తిగా కోలుకోలేదని స్పష్టం చేశాడు. గాయాల గురించి ప్రజలకు అవగాహన లేదని, అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు.‘రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోలేదు. 70 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు. అందుకే అతన్ని టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేయకుండా టెస్ట్ జట్టులోకి తీసుకున్నాం. ఆటగాళ్ల గాయాల గురించి విమర్శలు చేసేవారికి ఏం తెలియదు. గాయాల బారిన పడిన ఆటగాళ్ల పరిస్థితి ఏంటో మాకు, ఫిజియోలకు మాత్రమే తెలుసు.

అందుకే ఈ చెత్త మాటలు

అందుకే ఈ చెత్త మాటలు

విమర్శలు చేసే వారికి బీసీసీఐ ట్రైనర్లు, ఫిజియోలు చేసే పని గురించి ఏం తెలియదనుకుంటా. అందుకే ఈ చెత్త మాటలు మాట్లాడుతున్నారు. వృద్దిమాన్ సాహా, రోహిత్ గాయాల పరిస్థితి వేరు. టెస్ట్‌ల వరకు అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టే సాహా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అతను పరిమిత ఓవర్ల టీమ్స్‌లో కూడా లేడు. ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు టీమిండియా ఫిజియోలు, ట్రైనర్లు దుబాయ్‌లోనే ఉన్నారు. డాక్టర్ నితీష్ పటేల్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల గాయాలను పర్యవేక్షించాడు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

యోయో పాసైతేనే ఆసీస్‌కు..

యోయో పాసైతేనే ఆసీస్‌కు..

ఐపీఎల్ ముగిసిన అనంతరం రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియా వెళ్లకుండా నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కి చేరుకున్నాడు. అక్కడ గాయానికి చికిత్స తీసుకోనున్న హిట్ మ్యాన్ పూర్తిగా కోలుకున్నా.. యోయో టెస్ట్ నెగ్గితేనే ఆసీస్‌కు పయనమవుతాడు. ఇక డిసెంబరు 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఆసీస్‌లో అడుగుపెట్టిన వాళ్లకి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. తొలి టెస్టు ఆడాలంటే కనీసం 2, 3 రోజుల ముందు నుంచి జట్టుకు అందుబాటులో ఉండాలి. ఆ లెక్కల ప్రకారం ఈ నెలాఖరు లోపు రోహిత్ అక్కడికి చేరుకోవాలి.

యువరాజ్ న్యూ లుక్ వైరల్.. ‘హాయ్ అందగాడా'అంటూ బ్రిటీష్ బ్యూటీ కామెంట్!

Story first published: Friday, November 13, 2020, 20:03 [IST]
Other articles published on Nov 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+