Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ న్యూ లుక్ వైరల్.. ‘హాయ్ అందగాడా’అంటూ బ్రిటీష్ బ్యూటీ కామెంట్!

Kevin Pietersen cheekily reacts on Yuvraj Singh’s photo

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ న్యూలుక్ అటు అభిమానులను, ఇటు మాజీ క్రికెటర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పెద్ద మీసాలు, గడ్డంతో దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్‌ ఖలీఫా దగ్గర దిగిన ఫొటోను యువీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'బుర్జ్ ఖలీఫా' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోలో వైట్‌ టీషర్టు, బ్లూ జీన్స్‌ ధరించిన ఈ సిక్సర్ల సింగ్.. పెద్ద మీసాలు, గడ్డంతో బాలీవుడ్ హీరోను తలపించాడు. బ్యాక్ గ్రౌండ్‌లో బుర్జ్‌ ఖలీఫా కనిపిస్తోంది.

అయితే ఎప్పుడూ గడ్డం, మీసాలు తీసేసే యువీ.. ఈ సారి వాటితో దర్శనం ఇవ్వడం అందరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అభిమానులే కాదు అతని సహచర ఆటగాళ్లు కెవిన్‌ పీటర్సన్‌, హర్భజన్‌ సింగ్‌లు కూడా యూవీ లుక్‌కు ఫిదా అయ్యారు. 'ఎందుకు నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు?' అని పీటర్సన్‌ కామెంట్ చేయగా.. 'పాజీ అదిరింది!'అని హర్భజన్‌ మెచ్చుకున్నాడు. ఇక యువరాజ్‌ సింగ్‌​ సతీమణి, బ్రిటీష్ బ్యూటీ హజల్‌ కీచ్‌ కూడా ఆ ఫొటోపై 'హాయ్‌! అందగాడా' అని కామెంట్‌ చేశారు. దాంతో యువీ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

గతేడాది వన్డే ప్రపంచకప్‌ జరుగుతుండగానే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్ తరఫున 40 టెస్ట్‌లు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువీ.. సంప్రదాయక ఫార్మాట్‌లో 1900, వన్డేల్లో 8701 రన్స్, పొట్టి క్రికెట్‌లో 1177 రన్స్ చేశాడు. ఐపీఎల్‌కు కూడా దూరమైన ఈ సిక్సర్ల సింగ్.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే కొన్ని లీగ్‌ల్లో పాల్గొన్నాడు. బిగ్ బాష్‌ లీగ్‌లో కూడా ఆడుతాడని వార్తలు వినిపించాయి.

Story first published: Friday, November 13, 2020, 17:38 [IST]
Other articles published on Nov 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+