For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్చ్.. నటరాజన్‌కు నోచాన్స్.. మహ్మద్ షమీ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌!

India vs Australia: Shardul Thakur To Replace Mohammad Shami No Chance For Natarajan

మెల్‌బోర్న్: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ టెస్ట్ అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాల బారిన పడటంతో నట్టూ బరిలోకి దిగడం ఖాయామని అంతా భావించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక ఉమేశ్ యాదవ్ మూడో టెస్ట్‌కు దూరమైనా నాలుగో టెస్ట్ వరుకు అందుబాటులోకి వస్తాడని టీమ్ వర్గాలు తెలిపాయి. మణికట్టు గాయంతో సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న షమీ స్థానంలో శార్ధుల్ ఠాకుర్‌ను తీసుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

నాలుగో టెస్ట్‌కు ఉమేశ్ యాదవ్..

నాలుగో టెస్ట్‌కు ఉమేశ్ యాదవ్..

జనవరి 15న చివరిదైన నాలుగో టెస్టు ఆరంభం కానుంది. అప్పటి వరకు రెండు వారాల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో చివరి టెస్టులో ఉమేష్ యాదవ్ మళ్లీ ఆడుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘సెలెక్టర్లు మహ్మద్ షమీ స్థానంలో ముంబై పేసర్ శార్దుల్ ఠాకుర్‌ను తీసుకున్నారు. ఇప్పటికే బెంచ్‌లో నవ్‌దీప్ సైనీ ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ తదుపరి మ్యాచ్ ఆడకపోయినా నాలుగో టెస్ట్‌ వరకు అందుబాటులోకి వస్తాడు. అతను సిరీస్‌కు దూరమైతేనే నటరాజన్‌కు అవకాశం ఉంటుంది'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

గాయాలతో చాన్స్..

గాయాలతో చాన్స్..

ఐపీఎల్‌లో నటరాజన్ సత్తా చాటడంతో ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వరుణ్ చక్రవర్తి గాయంతో టీ20ల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత నవదీప్ సైనీ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతుండటంతో వన్డేల్లోకి వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో ఓడిన జట్టుకు మూడో వన్డేలో తనదైన బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసి ఓదార్పు విజయాన్నందించాడు. ఆ ప్రదర్శనతో టీ20ల్లోనూ కొనసాగించాడు. మూడు టీ20ల్లో పొదుపైన బౌలింగ్‌తో 6 వికెట్లు తీసి మరో బుమ్రాను తలపించాడు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ గాయపడటంతో టెస్టుల్లో కూడా నటరాజన్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సంప్రదాయక ఫార్మాట్‌లో ఆడేందుకు నటరాజన్ మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.

విహారీ, మయాంక్‌పై వేటు!

విహారీ, మయాంక్‌పై వేటు!

తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన హనుమ విహారీ, మయాంక్ అగర్వాల్‌పై వేటు పడే అవకాశం ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ క్వారంటైన్ ముగించుకొని నేడు జట్టుతో కలవనుండగా.. కేఎల్ రాహుల్ అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ బలం పెంచుకోవాని టీమిండియా భావిస్తోంది. అదే జరిగితే మయాంక్, విహారి బెంచ్ పరిమితమవ్వడం ఖాయం. ఒకవేళ రోహిత్‌ను ఒక్కడినే తీసుకోవాలంటే మాత్రం మయాంక్‌పై వేటు పడుతుంది. కానీ విన్నింగ్ టీమ్‌ను రహానే మారుస్తాడా? అనేది కూడా సందేహమే.

 సూపర్ విక్టరీ..

సూపర్ విక్టరీ..

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్‌ గ్రీన్‌ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్‌ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్‌ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

భారత బౌలింగ్‌కు గజ్జున వణుకుతున్నారు.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై పాంటింగ్ ఫైర్!

Story first published: Wednesday, December 30, 2020, 12:57 [IST]
Other articles published on Dec 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+