India vs Australia: విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. రోహిత్ శర్మకు ప్రమోషన్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది. సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌తో పాటు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్ మ్యాచ్ కూడా ఉండే టెస్టు సిరీస్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అయితే ఈ టూర్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను పక్కకు పెట్టిన సెలెక్షన్ కమిటీ.. ఆ తర్వాత టెస్ట్ టీమ్‌లోకి తీసుకుంది. చివరి మూడు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ దూరం కానున్న నేపథ్యంలో సంప్రదాయక ఫార్మాట్ పగ్గాలను రోహిత్ శర్మకు ఇవ్వాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

కోహ్లీకి పెటర్నీటి లీవ్..
వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతుండడంతో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ పెటర్నటీ సెలవులు మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మూడు టెస్టులకు విరాట్ దూరం కానున్నాడు. ఈ మేరకు ఆసీస్ టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్లలో బీసీసీఐ సోమవారం మార్పులు చేసింది. గాయం కారణంగా టూర్‌కు తొలుత ఎంపిక కాని ఓపెనర్ రోహిత్ శర్మను టెస్టు సిరీస్ కోసం తీసుకుంది. అతడికి పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ దూరమవుతున్న నేపథ్యంలోనే రోహిత్‌ను ఎంపిక చేసారనే వాదన కూడా తెరపైకి వచ్చింది.

రోహిత్‌కు ప్రమోషన్..
తాజాగా విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో జట్టు పగ్గాలను రోహిత్ శర్మకు ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఫామ్‌లో లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతినిచ్చామని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
‘ఓవైపు విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. మరోవైపు టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే పూర్ ఫామ్.. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలనుకుంటున్నాం. ఆ క్రమంలోనే వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతినిచ్చాం'అని సదరు అధికారి పేర్కొన్నారు.

రోహితే సరైనోడు..
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఇండియా టెస్టు టీమ్ కెప్టెన్సీ రోహిత్ శర్మకే అప్పగించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ‘ఆసీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమ్‌పై చాలా ప్రభావం పడుతుంది. కానీ, అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. క్రికెట్‌ను మించిన జీవితాన్ని, ఫ్యామిలీ చాలా ముఖ్యం అన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ఫీల్డ్‌లో కోహ్లీ ఉంటే చాలా ప్రభావం ఉంటుంది. అన్ని కండీషన్స్‌లోనూ ఇన్నేళ్లుగా అతను ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడో చూస్తున్నాం. రహానెకు నేను వ్యతిరేకం కాదు కానీ ఈ సిరీస్‌లో రోహితే కెప్టెన్‌గా ఉండాలి' అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

రివైజ్డ్ టీమ్స్..
ఇక ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో ఆసీస్ టూర్‌కు ఎంపిక చేసిన జట్లను బీసీసీఐ రివైజ్ చేసింది. భారత జట్టుకు తొలిసారి ఎంపికైన కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా టీ20 టీమ్‌లో చోటు కోల్పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన నటరాజన్ జట్టులోకి వచ్చాడు. వన్డే జట్టులోకి అదనపు కీపర్‌గా సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఈ టూర్ కొనసాగనుంది.
IPL 2020 టైటిల్ ఢిల్లీదే.. వారే గేమ్ చేంజర్లు: టీమిండియా మాజీ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications