Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 టైటిల్ ఢిల్లీదే.. వారే గేమ్ చేంజర్లు: టీమిండియా మాజీ క్రికెటర్

MI vs DC Final: Aakash Chopra picks Delhi Capitals as favourites to win IPL 2020

దుబాయ్: కరోనా నేపథ్యంలో జరుగుతుందా? లేదా? అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్‌ చివరి ఘట్టానికి చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్‌ చేరి మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోవైపు టైటిల్ ఫైట్‌కు 'సై' అంటున్నాయి.

మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా... టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్‌ తుది సమరం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ టైటిల్ ఢిల్లీ క్యాపిటల్స్‌దేనని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు.

 రహానే ఓపెనింగ్ చేయాలి..

రహానే ఓపెనింగ్ చేయాలి..

తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఢిల్లీ గెలవాలంటే చేయాల్సిన స్ట్రాటజీలను వివరించాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకొని ఢిల్లీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మార్కస్ స్టోయినిస్‌కు బదులు అజింక్యా రహానే‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాలన్నాడు. కొత్త బంతిని ఎదుర్కోవడంలో స్టోయినిస్ తడబడుతున్నాడని, ముఖ్యంగా బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్స్‌న్ వంటి దిగ్గజ బౌలర్లు ఎదుర్కోవడం అతని చాల కష్టమన్నాడు. గత మ్యాచ్‌లో రాణించినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం కుదరదన్నాడు. అందుకే రహానేతో ఓపెన్ చేయించాలని సూచించాడు.

ధావన్ చెలరేగితే..

ధావన్ చెలరేగితే..

ఇక శిఖర్ ధావన్ చెలరేగితే ఢిల్లీకి తిరుగుండదని, అతను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఫలితం ఢిల్లీకి అనుకూలంగానే ఉందన్నాడు. అతను విఫలమైన మ్యాచ్‌ల్లో దారుణంగా ఓడిందని గుర్తు చేశాడు. ముఖ్యంగా ముంబైతో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో ధావన్ డకౌట్ అయ్యాడని, దాంతో ఢిల్లీ దారుణ ఓటములు మూటగట్టుకుందన్నాడు. ఈ క్రమంలో ధావన్ ఇన్నింగ్స్ చాలా కీలకమని చెప్పాడు. ఢిల్లీకి ధావన్ ఓ గేమ్ చేంజరని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.

అయ్యర్, పంత్ ఆడాలి..

అయ్యర్, పంత్ ఆడాలి..

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్‌లోకి రావాలని ఈ మాజీ క్రికెటర్ ఆకాంక్షించాడు. ‘అయ్యర్, పంత్ ఫామ్‌లోకి రావాలని ఎదురు చూస్తున్నా. ఈ ఇద్దరు ఢిల్లీ జట్టుకు అదనపు బలం. కాకపోతే టోర్నీలో వీరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కనీసం ఫైనల్ మ్యాచ్‌లోనైనా చెలరేగుతారని ఆశిద్దాం'అని చోప్రా తెలిపాడు. ఇక నోర్జ్, రబడా, అశ్విన్, అక్షర్ పటేల్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందన్నాడు. నోర్జ్ ఈ మ్యాచ్ గేమ్ చేంజరని కొనియాడాడు. ఏది ఏమైనా ఈ రోజు ఢిల్లీనే టైటిల్ గెలుస్తుందని చోప్రా ధీమా మ్యక్తం చేశాడు.

దేశం కంటే వ్యక్తిగత జీవితమే ఎక్కువైందా? పెటర్నీటి లీవ్‌ తీసుకున్నకోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

Story first published: Tuesday, November 10, 2020, 17:18 [IST]
Other articles published on Nov 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+