వారెవ్వా వాటే లక్కీ వికెట్.. బెయిల్‌ను కిస్ చేసిన బాల్.. తెల్ల మొహం వేసిన స్మిత్! (వీడియో)

మెల్‌బోర్న్: మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చెలరేగిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. 131 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కీలక స్టీవ్ స్మిత్(8) వికెట్ కూడా కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో చాలా లక్కీగా లభించిన ఈ వికెట్‌తో అంతా అవాక్కయ్యారు. స్టీవ్ స్మిత్ అయితే తెల్ల మోహం వేసుకొని పెవిలియన్ బాట పట్టాడు. ఏ మాత్రం నమ్మశక్యం కానీ రీతిలో ఈ భారత్‌కు ఈ వికెట్ దక్కడం విశేషం.
ఇంతకేం జరిగిందంటే..?
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 33 ఓవర్ రెండో బంతిని స్మిత్ లెగ్‌సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్‌కు తగలకుండా లెగ్ స్టంప్ బెయిల్‌ను ఆఖరి క్షణంలో కిస్ చేసింది. అయితే దీన్ని ఆలస్యంగా గమనించిన భారత ఆటగాళ్లు అవాక్కయ్యారు. స్మిత్ వికెట్ లక్కీగా దొరకడంతో తెగ సంతోష పడ్డారు. ఈ వికెట్‌పై ఫీల్డ్ అంపైర్లు సమీక్ష కోరగా.. రిప్లేలో బంతి బెయిల్స్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఊహించన పరిణామంతో స్మిత్ తీవ్ర నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

కెరీర్‌లోనే రెండోసారి..
స్టీవ్ స్మిత్ కెరీర్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్ అందుకోకపోవడం ఇది రెండో సారి మాత్రమే. భారత్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో 1, 1 తో విఫలమైన స్మిత్.. రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకు వెనుదిరిగాడు. ఇక మూడు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ ఇబ్బంది పెట్టగా.. తాజా ఇన్నింగ్స్‌లో బుమ్రా దెబ్బతీశాడు. ఇక స్మిత్ వికెట్‌తో ఆసీస్ 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూవే(40 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(13) ఉన్నారు.

భారత్ 326 ఆలౌట్..
తాత్కలిక సారథి రహానే(112) సెంచరీతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 326 రన్స్ చేసి 131 పరుగుల ఆధిక్యం సాధించింది. రవీంద్ర జడేజా(57) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్, మిచెల్ స్టార్క్ మూడేసి వికెట్లు తీయగా.. కమిన్స్ రెండు, హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జోబర్న్స్(4), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ మార్నస్ (28) వికెట్లను కోల్పోయింది.
New Zealand vs Pakistan: వింతైన దృశ్యం.. నగ్నంగా పరిగెత్తుకొచ్చిన అభిమాని! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications