మెక్‌గ్రాత్ జనరేషన్ టాప్-5 బౌలర్లు.. భారత్ నుంచి ఒక్కడు లేడు!

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లేన్ మెక్‌గ్రాత్ ఆల్‌టైమ్ బెస్ట్ పేసర్ అనడంలో అతిశయోక్తి లేదు. మైదానంలో అతను తీసిన వికెట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. బౌలింగ్‌లో ఎక్కువ వేగం లేకున్నా.. వైవిధ్యమైన బంతులతో మెక్‌గ్రాత్ ప్రత్యర్థులను వణికించాడు. ముఖ్యంగా భారత్-ఆస్ట్రేలియా పోరంటేనే అతని గురించే మాట్లాడుకునేలా రాణించాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 381 వన్డే వికెట్లు తీసిన ఈ ఆసీస్ పేస్ దిగ్గజం.. తాజాగా అంతర్జాతీయ వన్డేల్లో రాణించిన తన జనరేషన్ టాప్-5 బౌలర్లను ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఒక్క భారత బౌలర్‌కు కూడా అవకాశం ఇవ్వలేదు.

నెంబర్ వన్ వసీం అక్రమ్..
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు టీవీ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న మెక్‌గ్రాత్.. బుధవారం మూడో వన్డేకు ముందు జరిగిన చర్చలో తన ఆల్‌టైమ్ టాప్ -5 బౌలర్లను ఎంచుకున్నాడు. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్‌ను నెంబర్ వన్ బౌలర్‌గా ఎంచుకున్నాడు. ఇక వసీం వన్డేల్లో 502 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

బ్రెట్‌లీ, చమింద వాస్
తన సహచర ఆటగాడు బ్రెట్‌లీకి మెక్‌గ్రాత్ తన ఆల్‌టైమ్ బౌలర్ల లిస్ట్‌లో అవకాశం కల్పించాడు. ఇక బ్రెట్‌లీ 2000-12 వరకు ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన పేసర్‌గా సేవలందించాడు. వన్డేల్లో 380 వికెట్లు తీశాడు. అలాగే శ్రీలంక దిగ్గజ పేసర్, 2003 వరల్డ్ కప్ హ్యాట్రిక్ హీరో చమింద వాస్‌ను ఎంపిక చేశాడు. వాస్ 2007 టీ20 ప్రపంచకప్ కూడా ఆడాడు. వన్డేల్లో అతను 400 వికెట్లు తీశాడు.

షాన్ పొలాక్, మురళీధరన్..
ఇక సౌతాఫ్రికా దిగ్గజం షాన్ పొలాక్‌ను ఎంచుకున్న మెక్‌గ్రాత్.. టాప్-5 బౌలర్లలో ఏకైక స్పిన్నర్‌కు అవకాశం కల్పించాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరణ్‌ను ఎంచుకున్నాడు. వన్డేల్లో పొలాక్ 3.67 ఎకానమీతో 393 వికెట్లు తీయగా.. మురళీదరన్ 534 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్కరికి అవకాశం దక్కకపోవడం గమనార్హం. మెక్‌గ్రాత్ హయాంలో భారత్ నుంచి జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, అనిల్ కుంబ్లే 74అద్భుతంగా రాణించారు. కానీ వారికి మెక్‌గ్రాత్ అవకాశం ఇవ్వలేదు.
మెక్‌గ్రాత్ టాప్-5 బౌలర్లు:
వసీం అక్రమ్(50), ముత్తయ్య మురళీ దరణ్(534), బ్రెట్ లీ (380), చమిందా వాస్ (400), షాన్ పొలాక్ (393)
Ind vs Aus: కోహ్లీసేనదే బ్యాటింగ్.. యార్కర్ల నట్టూ అరంగేట్రం!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications