నటరాజన్ టీ20లకు ఓకే.. టెస్ట్‌ల సంగతి చెప్పలేం: డేవిడ్ వార్నర్

మెల్‌బోర్న్: నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీ నటరాజన్.. అనూహ్యంగా వన్డే, టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఉమేశ్ యాదవ్ గాయపడటంతో టెస్ట్ జట్టు నుంచి కూడా పిలుపు అందుకున్నాడు. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో సూపర్ హిట్ అయిన నటరాజన్ టెస్ట్‌ల్లో ఏ మేరకు రాణిస్తాడో చెప్పలేమని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిన వార్నర్, తన సహచర ఆటగాడైన నటరాజన్ ప్రదర్శనను చాలా దగ్గర నుంచి చూశాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోని సక్సెస్‌ను నటరాజన్ టెస్ట్‌ల్లో కొనసాగిస్తాడా? అని వార్నర్‌ను ప్రశ్నించగా సందేహం వ్యక్తం చేశాడు.

అలా చేస్తే సక్సెస్ అవుతాడు..
‘రంజీ క్రికెట్‌లో నటరాజన్ గణంకాలు ఏమిటో, ఎలా బౌలింగ్ చేశాడో నాకు పెద్దగా తెలియదు. కానీ తన లైన్ అండ్ లెంగ్త్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. టెస్ట్ మ్యాచ్‌ల్లో అది కొనసాగిస్తాడా? అంటే కచ్చితంగా చెప్పలేను కానీ మహ్మద్ సిరాజ్ గురించి కాస్త ఎక్కువ తెలుసు. ఫస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో.. నట్టూకు అలానే అండగా ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాడు.

కంగ్రాట్స్ నట్టూ..
ఏదేమైనా టెస్ట్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం నట్టూకు దక్కిన గొప్ప బహుమతి. తండ్రి అయ్యానని తెలిసి కూడా నటరాజన్ నెట్ బౌలర్‌గా ఆసీస్ వచ్చాడు. ఆ తర్వాత నేషనల్ జట్టులోకి వచ్చాడు. ఆ విషయంలో అతనికి అభినందనలు. నటరాజన్ ఎంత గొప్ప బౌలరో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా నాకు బాగా తెలుసు.'అని వార్నర్ స్పష్టం చేశాడు.

అనూహ్య అవకాశంతో..
నెట్ బౌలర్‌గా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన నటరాజన్‌కు వరుణ్ చక్రవర్తి గాయంతో టీ20ల్లో అవకాశం దక్కింది. ఆ తర్వాత సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది. ఇక ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నటరాజన్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు.

మరో బుమ్రాలా..
తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఆఖరి టీ20లోనూ నట్టూ ఆకట్టుకున్నాడు. జోరు మీదున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేసినప్పటికీ అంపైర్ల తప్పిదంతో అది ఖాతాలోకి రాలేదు. ఇక నట్టూ అంతర్జాతీయ అరంగేట్రం అచ్చం బుమ్రాలానే ఉండటం విశేషం.
India vs Australia: మరోసారి క్వారంటైన్‌కు అంగీకరించని టీమిండియా.. బ్రిస్బేన్ టెస్ట్‌పై నీలినీడలు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications