India vs Australia: మరోసారి క్వారంటైన్‌కు అంగీకరించని టీమిండియా.. బ్రిస్బేన్ టెస్ట్‌పై నీలినీడలు!

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్వీన్స్‌ల్యాండ్ క్వారంటైన్ నిబంధనల ప్రకారం మరోసారి ఐసోలేషన్‌లో ఉండాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా సూచనను భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. అయితే చివరి టెస్ట్ కోసం ఇక్కడికి ప్రత్యేక విమానంలో రానున్న ఆసీస్, భారత్ జట్లు తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్ ఉండాలని స్పష్టం చేసింది. కానీ టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది.

మేం ఉండం..
ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నామని, మళ్లీ ఐసోలేషన్ అంటే మా వాళ్ల కాదని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో అన్నాడు. ‘బ్రిస్బెన్ వెళ్లి అక్కడ మళ్లీ కఠిన బబుల్‌లో ఉండటానికి భారత జట్టు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే దుబాయ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఉన్నాం. ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం. దాదాపు నెలరోజుల పాటు హోటల్ గదిలోనే ఉండిపోయాం. మళ్లీ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉండాలంటే మా వల్ల కాదు. అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.

సిడ్నీలోనే నాలుగో టెస్ట్..
మరోసారి క్వారంటైన్‌లో ఉండటానికి భారత జట్టు సుగుమంగా లేకపోవడంతో కఠిన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని క్విన్స్‌లాండ్ ప్రభుత్వాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కోరునుంది. ఒకవేళ మినహాయింపు ఇవ్వకపోతే నాలుగో టెస్ట్‌ను కూడా సిడ్నీ వేదికగానే నిర్వహించాలనే యోచనలో ఉంది. ఈ విషయాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
‘ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా రాష్ట్రాల కఠిన నిబంధనల నేపథ్యంలో సుమారు 6 నెలల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇది ఏ ఒక్కరికి అంత సులువు కాదు. ఇక ఈ సుదీర్ఘ పర్యటనలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. మరోసారి ఆటగాళ్లందరిని కఠిన బయో బబుల్‌లోకి పంపించాలనుకోవడం లేదు. బ్రిస్బేన్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకుంటే సిడ్నీ వేదికగానే నాలుగో టెస్ట్‌ను నిర్వహిస్తాం.'అని సదరు అధికారి తెలిపారు.

ఐసోలేషన్‌లో భారత ఆటగాళ్లు..
భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications