న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ముందు భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్!

India to play against South Africa before start of IPL 2020:Reports

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ వాయిదా ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఐపీఎల్‌కు సంబంధించిన కార్యచరణను బీసీసీఐ వేగవంతం చేసింది. వారం, పది రోజుల్లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై లీగ్ షెడ్యూల్‌‌పై తుది నిర్ణయం వెల్లడిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేజ్ పటేల్ స్పష్టం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడం ఖాయమైందని, టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు తెలిపారు. కోవిడ్‌-19 కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని పటేల్‌ చెప్పారు.

నెట్ ప్రాక్టీస్‌తో కష్టం..

నెట్ ప్రాక్టీస్‌తో కష్టం..

అయితే ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు భారత క్రికెటర్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా ఓ టీ20 సిరీస్‌ని నిర్వహించాలని బీసీసీఐపై స్టేక్‌ హోల్డర్స్ ఒత్తిడి తీసుకొస్తున్నారని బెంగళూర్ మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమై క్రికెటర్లు.. కేవలం నెట్ ప్రాక్టీస్‌తో ఐపీఎల్‌ లాంటి మెగాలీగ్ రాణించలేరని స్టేక్ హోల్డర్స్ వాదిస్తున్నారని తెలిపింది. దాంతో.. ఆగస్టులో ఓ మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆగస్టులో ప్లాన్ చేయాలని..

ఆగస్టులో ప్లాన్ చేయాలని..

ఇక యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక రచించగా.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. ఈ లీగ్ ప్రారంభానికి ముందే ఆగస్టులో దుబాయ్ వేదికగానే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నిర్వహించాలని స్టేక్ హోల్డర్స్ పట్టుబడుతున్నారు. ఈ విషయంపై బ్రిజేష్ పటేల్‌ను ప్రశ్నించగా.. వీటన్నిటిపై గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చిస్తామని, ఆ భేటీ తర్వాతే ఏదైనా తెలుస్తుందన్నారు.

ఏ జట్టుతో ఆగిపోయిందో..

ఏ జట్టుతో ఆగిపోయిందో..

వాస్తవానికి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మార్చిలోనే మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సింది. కానీ.. వర్షం కారణంగా తొలి వన్డే రద్దవగా.. ఆ వెంటనే కరోనా వైరస్ కారణంగా సిరీస్‌‌ను బీసీసీఐ వాయిదా వేసింది. అప్పటి నుంచి భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌తోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి టీమిండియా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని బీసీసీఐ స్టేక్ హోల్డర్స్ అభిప్రాయపడుతున్నారు.

టెస్ట్ ప్లేయర్లకు మొతెరాలో క్యాంప్..

టెస్ట్ ప్లేయర్లకు మొతెరాలో క్యాంప్..

ఐపీఎల్ ముగిసన తర్వాత టీమిండియా.. ఆసీస్ టూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో లీగ్‌లో భాగం కానీ ఆటగాళ్లకు మొతెరాలో ప్రాక్టీస్ కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ జరిగినన్ని రోజులు వాళ్లను అక్కడే ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. టెస్ట్‌లకు కీలకమైన చతేశ్వర్ పుజారాతో పాటు మరికొంత మంది ఇందులో పాల్గొంటారు.

భారత జట్టు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఇక్కడే ఉండనుంది. ఐపీఎల్ కోసం పనిచేసే 60 ఏళ్లకు పైబడిన కామెంటేటర్లకు వర్క ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

2021 టీ20 ప్రపంచకప్ ఎక్కడ? బీసీసీఐ-ఐసీసీ మధ్య వార్

Story first published: Wednesday, July 22, 2020, 10:44 [IST]
Other articles published on Jul 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X