Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్‌కు నో ఛాన్స్.. బుమ్రాకు రెస్ట్! అఫ్గాన్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలను అందుకుంది. న్యూఢిల్లీ వేదికగానే గురువారం ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా బెంచ్ ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉంది.

రెండో టీ20 విజయానంతరం శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే హింట్ ఇచ్చాడు. దాంతో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరగనున్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమిండియా ఉండగా.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని అఫ్గానిస్థాన్‌ భావిస్తోంది.

వైభవ్ ఎంట్రీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వైభవ్ ఎంట్రీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వైభవ్‌కు నో ఛాన్స్..

తొలి రెండు టీ20లకు దూరంగా ఉన్న వైభవ్ సూర్యవంశీని ఆఖరి మ్యాచ్‌లోనైనా ఆడిస్తారా? అనేది మిలియన డాలర్ల ప్రశ్నగా మారింది. రెండో టీ20లో సంజూ శాంసన్(22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఫామ్‌ అందుకున్నాడు. దాంతోనే ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌ను ఆడించే విషయంపై సందేహాలు నెలకొన్నాయి.

ఫామ్‌లో ఉన్న సంజూను పక్కనపెడితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైభవ్‌ను ఆడించాలనుకుంటే తొలి రెండు టీ20ల్లో ఆడిన అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చు.

India Playing XI for 3rd T20I vs Afghanistan No Vaibhav Sooryavanshi Yash Thakur Likely to Replace Bumrah

బుమ్రాకు రెస్ట్..

వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. బెంచ్‌పై ఉన్న యశ్‌ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వవచ్చు. అలాగే శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లో ఒకర్ని పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించవచ్చు. రవిబిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. వరుణ్‌కు ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే.. రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కుతుంది. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

అఫ్గాన్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ/రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా/యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.

IND vs AFG: సంజూ శాంసన్ ఊచకోత.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs AFG: సంజూ శాంసన్ ఊచకోత.. భారత్ ఘన విజయం!

అఫ్గాన్‌తో భారత జట్టు

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్.

Story first published: Wednesday, September 16, 2026, 9:43 [IST]
Other articles published on Sep 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+