వైభవ్ ఎంట్రీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన రెండో టీ20లో ఘన విజయం సాధించి ఇప్పటికే భారత జట్టు సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ మాట్లాడుతూ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని.. ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారని శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ప్రారంభంలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడం, ఆ తర్వాతి సవాళ్ల గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ.. క్రీడా ప్రయాణం అనే ది ఎప్పుడూ ఓ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.

ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. జట్టులోని అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. టీమ్ కాంబినేషన్లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 14.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


