Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెడ్ కోచ్ ఇంటర్వ్యూ: ఆరుగురు కాదు ఐదుగురే, ఆఖరి నిమిషంలో తప్పుకున్న సిమ్మన్స్‌

India head coach interviews: Phil Simmons backs out; announcement soon

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌ని ఎంపిక చేసేందుకు గాను కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, ఇంటర్వ్యూలు మొదలైన కొద్దిసేపటికే కోచ్‌ రేసు నుంచి ఫిల్‌ సిమ్మన్స్‌ తప్పుకున్నాడు.

అంత తక్కువా: ప్రో కబడ్డీ లీగ్ విలువెంతో తెలుసా?

హెడ్ కోచ్ పదవికి ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రాబిన్‌ సింగ్, ఫిల్‌ సిమన్స్‌ పోటీ పడుతున్నారు. అయితే వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ను ఇంటర్వ్యూ జాబితాలో నుంచి తొలగించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఫిల్‌ సిమ్మన్స్‌ ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిసింది.

దీంతో కోచ్‌ రేసులో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు. ఫిల్‌ సిమ్మన్స్‌ వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ జట్లకు కోచ్‌ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవి కోసం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల్లో టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్, కివీస్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ నేరుగా హాజరయ్యారు.

హెల్మెట్‌లో ఇరుకున్న బంతి: బ్యాట్స్‌మన్ వెంట పడ్డ ఫీల్డర్లు (వీడియో)

ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్‌ ద్వారా సాయంత్రం ఐదు గంటలకు క్రికెట్ సలహా కమిటీ ఇంటర్యూకు హాజరుకానున్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం హెడ్ కోచ్ ఇంటర్వ్యూలు రాత్రి ఏడు గంటలకు ముగియాల్సి ఉంది. అయితే, సిమ్మన్స్‌ తప్పుకోవడంతో ఆరు గంటలకే ఇంటర్వ్యూ ముగిసే అవకాశం ఉంది.

అంతరం టీమిండియా కొత్త కోచ్‌ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. కోచ్‌ రేసులో రవిశాస్త్రి ముందంజలో ఉన్నాడు. కొత్త కోచ్‌గా ఎంపికైన వారు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్‌ దక్కించుకోనున్నారు. టీ20 ప్రపంచ కప్‌ 2021 వరకు వీరు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

Story first published: Friday, August 16, 2019, 18:33 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+