Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో పోరుకు కివీస్ సిద్ధం: వన్డే జట్టు ప్రకటన... స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

భారత్ తో త్వరలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా అలాగే అనంతరం జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని కివీస్ యాజమాన్యం ఈ సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

రచిన్ రవీంద్ర రీఎంట్రీ.. రెండు జట్ల వ్యూహం
భుజం గాయం కారణంగా గతంలో భారత సిరీస్‌లో టీ20లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర పూర్తి ఫిట్‌నెస్ సాధించి వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. రచిన్ రవీంద్ర మొదటి మూడు వన్డేల్లో ఆడనున్నాడు. టెస్ట్ సిరీస్‌కు ఆటగాళ్లను సన్నద్ధం చేయడంతో పాటు జట్టు బెంచ్ బలాన్ని పరీక్షించేందుకే న్యూజిలాండ్ యాజమాన్యం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ ఈ ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

IND vs NZ New Zealand Squad for India ODI Series Announced Rachin Ravindra Returns Santner to Lead

తొలి మూడు వన్డేల జట్టు
నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే తొలి మూడు వన్డేలకు 14 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టెస్ట్ సిరీస్ నవంబర్ 19న వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో ప్రారంభం కానున్నందున కొందరు కీలక టెస్ట్ ఆటగాళ్లకు వన్డే సిరీస్ మధ్యలోనే విశ్రాంతినిచ్చి టెస్ట్ సన్నాహాలకు పంపనున్నారు.

తొలి 3 వన్డేల జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

Also Read

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

చివరి రెండు వన్డేల జట్టు
సిరీస్ లోని నాలుగో, ఐదో వన్డేల్లో ప్రయోగాలకు పీట వేస్తూ కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పించారు. టీ20ల్లో అద్భుతంగా ఆడే ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ లు జట్టులోకి తిరిగొచ్చారు. అలాగే క్రిస్టియన్ క్లార్క్, మాట్ ఫిషర్, మిచ్ హే, నిక్ కెల్లీలను బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఎంపిక చేశారు.

చివరి 2 వన్డేల జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, మిచ్ హే (వికెట్ కీపర్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

2027 ప్రపంచ కప్ లక్ష్యం
ఈ సిరీస్ కేవలం ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాకుండా 2027 ప్రపంచ కప్ సన్నాహాల్లో కీలక పాత్ర పోషిస్తుందని హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. కాగా గాయాల కారణంగా జాకరీ ఫాల్క్స్, విల్ ఓ రూర్క్, బెన్ పియర్స్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు.

భారత్ vs న్యూజిలాండ్ (షెడ్యూల్)
*మొదటి టీ20 - అక్టోబర్ 22, క్రైస్ట్‌చర్చ్, మధ్యాహ్నం 12:30
*రెండో టీ20 - అక్టోబర్ 24, క్రైస్ట్‌చర్చ్, మధ్యాహ్నం 12:30
మూడో టీ20 -అక్టోబర్ 27, వెల్లింగ్టన్, మధ్యాహ్నం 12:30
*నాలుగో టీ20 - అక్టోబర్ 30, ఆక్లాండ్, మధ్యాహ్నం 12:30
*ఐదో టీ20 - నవంబర్ 1, హామిల్టన్, మధ్యాహ్నం 12:30

*మొదటి వన్డే - నవంబర్ 4, ఆక్లాండ్, ఉదయం 7:30
*2వ వన్డే - నవంబర్ 7, వెల్లింగ్టన్, ఉదయం 7:30
*3వ వన్డే - నవంబర్ 10, హామిల్టన్, ఉదయం 7:30
*4వ వన్డే - నవంబర్ 13, మౌంట్ మాంగనూయి, ఉదయం 7:30
*5వ వన్డే - నవంబర్ 15, మౌంట్ మాంగనూయి, ఉదయం 7:30
*1వ టెస్ట్ - నవంబర్ 19 నుండి 23 వరకు, వెల్లింగ్టన్, ఉదయం 3:30 గంటలకు
*2వ టెస్ట్ - డిసెంబర్ 27 నుండి 1 వరకు, క్రైస్ట్‌చర్చ్, ఉదయం 1 గంట నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

Story first published: Sunday, October 11, 2026, 10:03 [IST]
Other articles published on Oct 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+