Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సంజూ శాంసన్ మళ్లీ ఫ్లాప్.. టపటపా రెండు వికెట్లు డౌన్!

IND vs NZ: హామిల్టన్‌లోని సెడన్ పార్క్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకోగా.. ఈ చివరి మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్‌ను 4-1 తేడాతో ముగించాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

IND vs NZ: టీమిండియా ప్లేయింగ్ 11లో అనూహ్య మార్పులు.. తుదిజట్టులో ఆ ఇద్దరికి చోటు!

IND vs NZ: టీమిండియా ప్లేయింగ్ 11లో అనూహ్య మార్పులు.. తుదిజట్టులో ఆ ఇద్దరికి చోటు!

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రెండో ఓవర్లోనే ఆడమ్ మిల్నే బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ కూడా నిరాశపరిచాడు. దీంతో భారత్ 19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్ డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇషాన్ కిషన్ కు శ్రేయస్ అయ్యర్ తోడవ్వడంతో ధారాళంగా పరుగులు రావడం ప్రారంభమైంది. 11వ ఓవర్లో మంచి ఊపు మీదున్న ఇషాన్ కిషన్ ఔటవ్వడంతో భారత జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి తిలక వర్మ క్రీజులోకి వచ్చాడు. దీంతో భారత్ 10.3 ఓవర్లలో 113 పరుగులు పూర్తి చేసుకుంది.

IND vs NZ 5th T20I Sanju Samson Flops Again Abhishek out Early Ishan Kishan Smashes 61 off 32 Balls
IND vs NZ: ఆదుకున్న ధ్రువ్ జురెల్.. భారత్-ఏ భారీ స్కోర్!

Also Read

IND vs NZ: ఆదుకున్న ధ్రువ్ జురెల్.. భారత్-ఏ భారీ స్కోర్!

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు ప్లేయింగ్-11లో చోటు దక్కింది. మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్‌లు తుది జట్టుకు దూరం కాగా.. యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం లభించలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో మ్యాథ్యూ ఫిషర్ స్థానంలో బ్లెయిర్ టిక్నర్ తుది జట్టులోకి వచ్చాడు.

Story first published: Sunday, November 1, 2026, 13:41 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+