Ind vs Aus: విరాట్ కోహ్లీతో వైరమే.. రోహిత్ శర్మ వేటుకు కారణమా?

హైదరాబాద్: కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సునీల్ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ సోమవారం వర్చువల్‌గా సమావేశమై.. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే ఎడమ కాలి గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఒక్క ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది.
అయితే రోహిత్ శర్మ ఎంపికచేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడని, గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాక్టీస్ ఎలా చేస్తాడని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ గాయంపై బీసీసీఐని నిలదీయాలని అభిమానులకు సూచించాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న విబేధాల కారణంగానే రోహిత్ పక్కన పెట్టారా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది.

విభేదాలే కారణమా?
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలనే వార్తలు గతేడాది కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఈ ఇద్దరూ మీడియా ముఖంగా కొట్టిపారేసినా వారు చేసే పనులు మాత్రం వైరం నిజమే అనేలా ఉన్నాయి. ఈ విభేదాలతోనే ఆసీస్ పర్యటనకు రోహిత్‌ను పక్కనపెట్టారని కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు. రోహిత్ శర్మ ఫిట్‌గా లేకుంటే ఎలా ప్రాక్టీస్ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.
ఈ లెక్కన అతను ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకోవాలని, మరెందుకు కొనసాగిస్తున్నారని నిలదీస్తున్నారు. చిన్న గాయమే అనుకుంటే.. ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లో పక్కన పెట్టొచ్చని, డిసెంబరు 27 నుంచి ప్రారంభమయ్యే టెస్టులకి అవకాశం కల్పించవచ్చని సునీల్ గవాస్కర్ అనడం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గవాస్కర్ చెప్పినట్లు టెస్ట్‌లకు ఇంకా నెలన్నర సమయం ఉందని, ఆలోపు రోహిత్ ఫిట్‌నెస్ సాధించడా? అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మయాంక్‌కు ఎలా చాన్స్?
ఇక మయాంక్ అగర్వాల్ కూడా తొడ కండరాల సమస్యతో కింగ్స్ పంజాబ్ తరఫున గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కానీ అతనికి మూడు జట్లలో అవకాశం కల్పించారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ.. అతనికైన గాయం చిన్నదా? అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. గవాస్కర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ‘రోహిత్ శర్మకు ఏమైందనే విషయం కనీసం ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ అధికారులు నిజాయతీగా చెప్పాలి.
గాయంపై ఓ స్పష్టత ఇవ్వాలి. తన ఫేవరేట్ ఆటగాడికి ఏమైందనే విషయం తెలుసుకునే అర్హత ప్రతి భారత అభిమానికి ఉంది. మయాంక్ అగర్వాల్ కూడా గాయపడ్డాడు. కానీ అతనికి మూడు జట్లలో చోటు దక్కింది. మరి రోహిత్ శర్మకి ఏమైంది. ఎందుకు అతన్ని పక్కనపెట్టారు.' అని గవాస్కర్ ప్రశ్నించారు.

ముఖం చాటేశారు
ఈ ఐపీఎల్ తొలి అంచె మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకరికొకరు మాట్లాడుకోలేదు. కనీసం చూసుకోలేదు. అప్పుడు కూడా నెటిజన్లు వీరి మధ్య ఏదో జరుగుతుందనే సందేహాలను రేకెత్తించారు. టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన ఈ ఇరు జట్ల కెప్టెన్లు కరోనా నిబంధనల కారణంగా దూరం దూరంగానే నిలబడ్డారు. హోస్ట్ మురళీ కార్తీక్‌తోనూ ఎవరికీ వారు మాట్లాడుకున్నారు. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ముఖాలు తిప్పుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే ఇతర మ్యాచ్‌ల సమయంలో ప్రత్యర్థి కెప్టెన్లతో జోవియల్‌గా కనిపించిన ఈ ఇద్దరూ.. నిన్నటి మ్యాచ్‌లో భిన్నంగా నడుచుకోవడంతో వీరి మధ్య ఎదో జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి.

అప్పుడు ఇన్‌స్టాలో..
గతేడాది రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మను అన్‌ఫాలో చేయడం.. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి బలాన్నిచ్చింది. వీరి మధ్య ఏదో జరుగుతుందనే సందేహాలను రేకెత్తించింది. అలాగే టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు దూరంగా ఉండాలని కోహ్లీ మొదట భావించాడని.. కానీ రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఇష్టం లేక.. మళ్లీ మనసు మార్చుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. ప్రపంచకప్ అనంతరం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అబ్బో నీకు సిక్స్ ప్యాక్ ఉన్నట్టే.. సిగ్గుండాలి సెహ్వాగ్..రోహిత్ శర్మను వడా పావ్ అనడంపై ఫ్యాన్స్ ఫైర్