For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదేపదే నాపై స్లెడ్జింగ్‌కు దిగిన కోహ్లీ నోరు అలా మూయించా: బంగ్లాదేశ్ క్రికెటర్

Imrul Kayes recalls how he countered Virat Kohlis sledge

ఢాకా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లోనే కాకుండా ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించే విషయంలో అదే వైఖరి కొనసాగిస్తుంటాడు. తనపై నోరుపారేసుకుంటే ఎంతటి ఆటగాడికైనా బదులివ్వడానికి వెనుకడుగు వేయడు. అండర్-19 ప్రపంచ‌కప్ నుంచే కోహ్లీ ఈ వైఖరిని అనుసరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కవ్వింపులకి దిగినట్లు తాజాగా ఆ దేశ క్రికెటర్ ఇమ్రూల్ ఖైస్ గుర్తు చేసుకున్నాడు.

స్నేహాన్ని మరిచి..

స్నేహాన్ని మరిచి..

క్రిక్ ఫ్రెంజీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. 2011లో కోహ్లీ తనపై స్లెడ్జింగ్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయ్యానని ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్యాంప్‌‌కు హాజరైనప్పుడు తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నాడు. కానీ అది మరిచిపోయి కోహ్లీ నన్ను కవ్వించాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తమ సీనియర్ ప్లేయర్లకు చెప్పడంతో వారు విరాట్‌కు సరైన రీతీలో బదులిచ్చారని, అప్పటి నుంచి అతను తన జోలికి రాలేదన్నాడు.

తమీమ్ బదులివ్వడంతో..

తమీమ్ బదులివ్వడంతో..

‘విరాట్ కోహ్లీ నేను 2007లో ఆస్ట్రేలియాలో ఓ క్యాంప్‌కి హాజరయ్యాము. అప్పటి నుంచే మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం మేం తొలిసారి 2011లో తలపడ్డాం. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ నాపై స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే.. నేను అతనికి ఏమీ బదులివ్వకుండా తమీమ్ ఇక్బాల్‌కి ఈ విషయం చెప్పాను. దాంతో.. తమీమ్ గ్రౌండ్‌లో కోహ్లీపై స్లెడ్జింగ్‌‌కు దిగాడు. వాస్తవానికి కవ్వింపులకి దిగడంలో తమీమ్‌ ఎక్స్‌ఫర్ట్. అలానే మైదానంలోనూ దూకుడుగా ఉంటాడు. తమీమ్ ఎదురుదాడితో కోహ్లీ అప్పటి నుంచి నాపై స్లెడ్జింగ్‌కి చేయలేదు.' అని ఇమ్రూల్ ఖైస్ వెల్లడించాడు.

గతేడాది ప్రతీ ఒక్కరిని కవ్వించాడు..

గతేడాది ప్రతీ ఒక్కరిని కవ్వించాడు..

ఇక గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ తమ ఆటగాళ్లందరిని కవ్వించాడని, ఇమ్రూల్ ఖైస్ చెప్పుకొచ్చాడు. కానీ తనను మాత్రం ఒక్క మాట అనలేదని గుర్తు చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోహ్లీ సారథ్యం వహించిన ఫతల్లా టెస్ట్‌లో కూడా తనను ఒక్క మాట అనలేదని ఈ బంగ్లా క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

నోట్ బుక్ సెలెబ్రేషన్స్..

నోట్ బుక్ సెలెబ్రేషన్స్..

విరాట్ కోహ్లీ జట్టులో ఉన్న సమయంలోనే భారత్‌తో ఇమ్రూల్‌ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రూల్, కోహ్లీ మధ్య స్లెడ్జింగ్ వాతావరణం ఏమీ కనిపించలేదు. ఇక బంగ్లాదేశ్‌కే చెందిన ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్‌, కోహ్లీ మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు మాత్రం జరుగుతోంది. అండర్-19 వరల్డ్‌కప్ నుంచి ఈ ఇద్దరూ తరచూ కవ్వింపులకి దిగుతున్నారు. ఇక గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌లో ఆ జట్టు పేసర్ కెస్రిక్ విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లీ చేసిన నోట్‌బుక్ సెలెబ్రెషన్ హాట్ టాపిక్‌గా నిలిచింది.

చహల్.. నా గిటార్ నీ అంత ఉంటుంది: కోహ్లీ

Story first published: Friday, May 15, 2020, 14:36 [IST]
Other articles published on May 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+