For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.600 లేక క్రికెట్‌ను వదిలేసిన ఇర్ఫాన్ ఖాన్

I was an all-rounder- Short of Rs 600, how Irrfan Khan gave up cricket for acting
#IrrfanKhan : Short Of Rs 600 Irrfan Khan Lost His Cricket Career

ముంబై: ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. 54 ఏళ్ల ఇర్ఫాన్ 2018 నుంచి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్​ అనే వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నారు. లండన్‌లో చికిత్స తీసుకుని ఇటీవల భారత్‌కు వచ్చారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ లెజండరీ యాక్టర్ మరణంపై యావత్ దేశం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖుల ట్విటర్ వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు.

క్రికెటర్ కాబోయే యాక్టర్ అయ్యా..

క్రికెటర్ కాబోయే యాక్టర్ అయ్యా..

అయితే విలక్షణ నటుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్న ఇర్ఫాన్ ఖాన్.. తన 20 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనుకున్నాడట. కానీ డబ్బుల్లేక క్రికెట్‌ను అర్దాంతరంగా వదిలేయాల్సి వచ్చిందని 2014లో ది టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లెజండరీ యాక్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఏవరిని అడగాలో తెలియక..

ఏవరిని అడగాలో తెలియక..

తాను సీకే నాయుడు ట్రోఫీ(అండర్-23 క్రికెట్ టోర్నీ)కూడా ఎంపికైనట్లు.. రూ.600 డబ్బులు లేక టోర్నీలో పాల్గొనలేదని ఆ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ తెలిపారు.‘నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెటర్ అవ్వాలనేది అప్పట్లో నా కల. జైపూర్‌లోని మా జట్టులో నేనే ఆల్‌రౌండర్‌ని. అతి చిన్నవాడిని. క్రికెట్‌నే నా కెరీర్‌గా భావించా. ఈ ప్రయత్నంలో సీకే నాయుడు టోర్నీకి కూడా ఎంపికయ్యా.

కానీ ఆ సమయంలో డబ్బు అవసరం ఉండి, ఎవరిని అడగాలో తెలియక క్రికెట్‌ను వదిలేశా. అప్పడు రూ.600 కోసం ఇబ్బంది పడ్డా. ఎవరిని అడగలేకపోయా. ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ డ్రామా‌లో అడ్మిషన్ కోసం కూడా రూ.300 కావాల్సి వచ్చాయి. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డా. కానీ నా సోదరి ఆ డబ్బులను ఏర్పాటు చేసింది.'అని ఇర్ఫాన్ గుర్తు చేసుకున్నారు.

వదిలేయడమే మంచిదైంది..

వదిలేయడమే మంచిదైంది..

సినిమా, క్రికెట్ రెండింటిని పోల్చితే ఆ రోజు ఆటను వదిలేయడమే తనకు మంచిదైందని ఈ విలక్షణ నటుడు అభిప్రాయపడ్డారు. ‘క్రికెట్‌ను వదిలేయడమే మంచిదైంది. ఎందుకంటె క్రికెట్‌లో దేశం మొత్తం మీద కేవలం 11 మంది ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. అదే నటులు అయితే అలా కాదు ఎంత మందైనా ఉండచ్చు, ఎన్నేళ్ళైనా ఉండొచ్చు, పైగా నటనకి వయో పరిమితి లేదు, ఎంత కష్టపడితే అంత పైకి రావచ్చు'అని తెలిపారు. ఇక టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేసిందని, తాను సంప్రదాయక క్రికెట్ లవర్‌నని అప్పట్లో ఇర్ఫాన్ చెప్పుకొచ్చారు.

ధోనీ మళ్లీ ఆడాలి.. అతని చివరి మ్యాచ్‌లో నేనుండాలి: యువపేసర్

Story first published: Wednesday, April 29, 2020, 16:47 [IST]
Other articles published on Apr 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+