Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బా... కొంచెం ధోనీని చూపించరా.. సీఎస్‌కే మేనేజర్‌కు సాక్షి రిక్వెస్ట్!

‘I wanna see Mahi’ Sakshi Dhoni requests during Instagram live session

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ చాంప్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే రసవత్తరపోరుతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ప్రాక్టీస్ సెషన్‌ను ఆ ఫ్రాంచైజీ ఇన్‌స్టా లైవ్ సెషన్ ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.

దీనిని టీమ్ మేనేజర్ రస్సెల్ రాధాకృష్ణన్ పర్యవేక్షించారు. అయితే ఈ లైవ్ సెషన్ సందర్భంగా ధోనీ సతమణి సాక్షి సింగ్ తన భర్తను చూపించాలని కోరింది. 'నాకు ధోనీని చూడాలనుంది'అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌ను చూసిన టీమ్ మేనేజర్ రస్సెల్.. వెంటనే కెమెరాను ధోనీవైపుకు తిప్పాడు. మహీని చూసిన సాక్షి.. మేనేజర్‌కు ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

ఇక కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈకి తరలిపోవడంతో ధోనీ ఒక్కడే అక్కడికి వెళ్లాడు. ఇతర ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లినా మహీ మాత్రం రిస్క్ తీసుకోలేదు. ఇక గత 14 నెలలుగా మహీ ఆటకు దూరంగా ఉండటం.. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్ బరిలోకి దిగుతుండటంతో అతని ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లీగ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న నేపథ్యంలో జట్టును ఎలా నడిపిస్తాడా? అనే ఆతృతతో ఉన్నారు.

Story first published: Friday, September 18, 2020, 15:22 [IST]
Other articles published on Sep 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+