Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌరవం భావిస్తున్నా: కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి

Honoured To Have Photo Taken With Virat Kohli : Viv Richards To Ian Bishop || Oneindia Telugu
Honoured to have photo taken with Virat Kohli: Viv Richards to Ian Bishop

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ఫొటో దిగడం ఎంతో గౌరవంగా ఉందని వెస్టిండిస్‌ మాజీ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ తనతో చెప్పాడని మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్‌ మంగళవారం రాత్రి గయానాకు చేరుకుంది.

ఈ మ్యాచ్ కోసం సోమవారం భారత ఆటగాళ్లు విండీస్ చేరుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ను కలిశాడు. ఈ సందర్భంగా రిచర్డ్స్‌, కోహ్లీ కలిసి దిగిన ఫొటోని భారత కెప్టెన్ తన ట్విటర్‌లో 'బిగ్గెస్ట్‌ బాస్‌తో' అనే క్యాప్షన్‌తో పోస్టు చేశాడు. ఈ ఫొటో చూసి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇయాన్‌ బిషప్‌ రిచర్డ్స్‌తో మాట్లాడారు.

కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి

కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి చూపారని, ఈ విషయాన్ని ఆయనే నాతో చెప్పాడని బిషప్‌ ట్వీట్ చేశాడు. "కోహ్లీ ట్వీట్‌ చేసిన విషయం తనకు తెలియదని, అతడితో ఫొటో దిగడం గౌరవంగా భావిస్తున్నానని రిచర్డ్స్‌ చెప్పాడు" అని ట్విట్టర్‌లో ఇయాన్ బిషప్ వెల్లడించాడు.

రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!

ట్విటర్‌లో పోస్టు చేసిన కోహ్లీ

ఇదిలా ఉంటే, వివ్‌ రిచర్డ్స్‌తో దిగిన ఫొటోని విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు 'బిగ్గెస్ట్‌ బాస్‌' వివ్‌ రిచర్డ్స్‌తో అని కోహ్లీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'ఇద్దరు లెజెండ్స్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'గ్రేట్ బాస్‌' అని మరో అభిమాని ట్వీటాడు.

3-0తో టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

3-0తో టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇక, మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుత వరల్డ్ టీ20 ఛాంపియన్స్‌గా ఉన్న వెస్టిండిస్‌ను ఆరు టీ20ల్లో వరుసగా ఓడించిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫోకస్ వన్డే సిరిస్‌కు మళ్లింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది.

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

ఓపెనర్ జోడీగా రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

ఓపెనర్ జోడీగా రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన టీమిండియా... అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది.

Story first published: Thursday, August 8, 2019, 13:41 [IST]
Other articles published on Aug 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+