జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ విధ్వంసం చూశారా?

ముంబై: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా.. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ అత్యద్భుతం. అలాంటి బుమ్రా బ్యాటింగ్‌లో మాత్రం చాలా వీక్. ఎంత బలహీనమంటే.. అతని అత్యధిక స్కోర్ కేవలం 10 పరుగులే. అంతేకాకుండా ఈ స్టార్ పేసర్ పరుగుల సగటు టెస్టుల్లో 2.9, వన్డేల్లో 3.8, టీ20ల్లో 4. అయితే భీకర బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన భారత జట్టులో అతనికి అవకాశాలు రావడం చాలా తక్కువే. కానీ ప్రస్తుత తరుణంలో బౌలర్లు కూడా మెరుపులు మెరిపిస్తున్నారు.
ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకుర్ కొన్ని మ్యాచ్‌ల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అనూహ్య బ్యాటింగ్‌తో ప్రశంసలు అందుకున్నారు. స్టార్ పేసర్ అయినా జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలో 11వ స్థానంలో వచ్చే వారు కూడా విజయం కోసం ఆఖరి క్షణం వరకు పోరాడుతారు.
బ్యాటింగ్ రాదనుకున్నారా?
సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ కామెంట్స్‌కు కొంచెం హర్ట్ అయిన బుమ్రా.. తన పాత వీడియోలను అన్వేషించి.. ‘బ్యాటింగ్ రాదనుకుంటున్నారా? ఆడలేననుకుంటున్నారా?'అనే లెవల్లో ఓ వీడియోను ట్వీట్ చేశాడు. పైగా దీనికి ‘చాలా మంది డిమాండ్ మేరకు, ముఖ్యంగా యూవీ కోసం.. 2017లో జస్‌ప్రీత్ బుమ్రా మ్యాచ్ విన్నింగ్ నాక్ 'అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇంతకీ ఈ వీడియో ఏంటంటే.?
గుజరాత్, గోవా మధ్య 2017లో జరిగిన ఓ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో గుజరాత్ తరపున బరిలోకి దిగిన బుమ్రా కేవలం 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి జట్టు గెలపులో కీలక పాత్ర పోషించాడు. భారీ షాట్‌లతో గోవా బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ నలుమూలలా బౌండరీలను కొడుతూ, ఓ ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్‌ను తలపించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు టీ20ల్లో బుమ్రాను ఓపెనింగ్ పంపాల్సిందే.. బ్యాట్స్‌మన్ అనే విషయం గుర్తించాల్సిందేనని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

తల్లి, తండ్రిలో ఎవరు ఇష్టమంటే..?
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుమ్రాతో లైవ్ సెషన్ నిర్వహించిన యువరాజ్.. ఈ స్టార్ పేసర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటూ క్లిష్టమైన ప్రశ్నలు సంధించాడు. అతని ప్రశ్నల ధాటికి బుమ్రా చేతులెత్తేశాడు. కానీ కొన్ని ప్రశ్నలకు ఈ యార్కర్ల కింగ్ స్మార్ట్‌గా సమాధానమిచ్చాడు.
యువరాజ్-ధోనీలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఎవరని సిక్సర్ల సింగ్ ప్రశ్నించగా.. తల్లి, తండ్రిలో ఎవరూ ఇష్టమంటే ఏం చెబుతామని ఎదురు ప్రశ్నించాడు. అలాగే సచిన్-కోహ్లీ, భజ్జీ-అశ్విన్‌లో ఎవరు బెస్ట్ అని చెప్పమనగా బుమ్రా నిరాకరించాడు. కానీ యూవీ పట్టుబట్టడంతో సచిన్, భజ్జీల పేర్లును తెలిపాడు.

ఎక్కువ రోజులు ఆడవన్నారు..
ఇక తన విలక్షణమైన బౌలింగ్ శైలి కారణంగా క్రికెట్‌లో ఎక్కువకాలం కొనసాగలేవని చాలామంది అనేవారని బుమ్రా గుర్తు చేసుకున్నాడు. ఒకట్రెండు రంజీలకు మించి ఆడలేవని తనను నిరాశపర్చేవారని చెప్పుకొచ్చాడు. అలాగే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు కూడా లేవని చాలా మంది అనేవారని గుర్తుచేసుకున్నాడు. వెంటనే బుమ్రాపై యువీ ప్రశంసలు కురిపించాడు. ఎవరేమనుకున్నా మూడు ఫార్మాట్లలో వరల్డ్ నెం.1 అయ్యే సామర్థ్యం నీలో ఉందని నిరూపించావని కితాబిచ్చాడు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా, లక్ష్యంపై దృష్టి పెడితే రెండేళ్లలోనే బుమ్రా ఈ ఘనతను సాధించే అవకాశముందని యూవీ వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీని మించినోడు లేడు: ఆర్పీ సింగ్