లేజీ గర్ల్స్‌నే డబ్బు ఆకట్టుకుంటుంది.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై మనోజ్ తివారీ ట్వీట్

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది సుమారు రెండు నెలలు కావస్తున్నా.. ఓ తెలుగు టీవీ ఛానల్ క్రైం సీరియల్‌లా ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయే తప్ప.. కేసు కథేంటన్నది అంత సులువుగా తేలటట్టు కనబడటంలేదు. చివరకు సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో కొత్త కొత్త విషయాలు కూడా బయటకొస్తున్నాయి. అసలు సుశాంత్‌ది ఆత్మహత్యా..? హత్యా? అన్నదే ప్రధాన చర్చ. ఎప్పుడైతే హత్య అన్న అనుమానాలు మొదలయ్యయో.. అవి క్రమేపీ బలపడుతూ వచ్చాయి. విచారణలో కూడా ఏదో తేడా వస్తొందంటూ ముంబై పోలీసులపై ఆరోపణలు రావడం.. బీహార్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

రియా చుట్టూ కేసు..
అయితే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై అతని తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. ఆమెపై మనీలాండరింగ్ అభియోగాలు మోపి పలుమార్లు విచారించారు. దీంతో సుశాంత్ మరణానికి రియానే కారణమని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఓ విషకన్యగా పేర్కొంటూ మండిపడుతున్నారు.
హలో గోల్డ్ డిగ్గర్స్..
ఈ నేపథ్యంలోనే ప్రతి విషయంపై స్పందించే టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ సుశాత్ కేసుపై కూడా స్పందించాడు. సుశాంత్ తాజా చిత్రం దిల్‌బచారేలోని ఫొటోను ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న మనోజ్.. లేజీ గర్ల్స్‌నే డబ్బును ఆకర్షిస్తుందని రియాపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ‘గోల్డ్ డిగ్గర్స్.. చదవండి.. డబ్బు సోమరితనం ఉన్న అమ్మాయిలను మాత్రమే ఆకట్టుకుంటుంది. కష్టపడి పనిచేసే మహిళలకు ఇతరుల డబ్బు, తెలివి బోనస్ మాత్రమే తప్పా ఎదిగేందుకు మాత్రం కాదు'అని #EDExposeRheaInSSRCase అనే యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు.

కరెక్ట్ మనోజ్..
ఇక మనోజ్ తీవారీ ట్వీట్‌తో చాలా మంది నెటిజన్లు ఎకీభవించగా కొందరు మాత్రం తప్పుబట్టారు. ఆమె సుశాంత్‌ను డబ్బుల కోసమే లోబర్చుకుందని ఒకరు అనగా.. ‘కరెక్ట్‌గా చెప్పావ్ మనోజ్.. ఆమె ఒక్కతే కాదు ఈ కుట్రలో రియా కుటుంబం మొత్తం ఉంది'అని కామెంట్ చేశారు. ఇక కొందరేమో ఆమెపై కేవలం అభియోగాలు మాత్రమే.. అవింకా నిరూపితం కాలేదని, ఈ ట్వీట్‌ను తొలగించాలని మనోజ్‌కు సూచిస్తున్నారు. ఇక భారత్ తరఫున 12 వన్డేలు, 3టీ20లు ఆడిన తివారీ అదృష్ట కలిసిరాక స్టార్ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు.

కంగనాకు మద్దతు..
ఇక సుశాంత్ చనిపోయినప్పటి నుంచి బాలీవుడ్‌లోని నెపోటిజమ్ గురించి గళమెత్తిన హీరోయిన్ కంగనా రనౌత్‌కు మనోజ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. బంధుప్రీతి వల్లే సుశాంత్ చనిపోయాడని కంగనా ఆరోపించగా.. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనోజ్ కంగనాకు అండగా ట్వీట్ చేశాడు. 'సుశాంత్ మృతిపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ఆమెపై దాడి చేస్తున్నారు. అయితే అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం చేసిన కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే చేరుతుంది' అంటూ #IndiaWantsSushantTruth అనే హ్యష్ ట్యాగ్‌ను జత చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications