సీఎస్‌కే గెలవాలంటే మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌తో ఆ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలి: హర్షా భోగ్లే

దుబాయ్: పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్.. ఓసారి సెమీస్... మరోసారి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ ట్రాక్ రికార్డు ఇది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న సీఎస్‌కే ఈ సీజన్‌లో ఊహించని విధంగా విఫలమవుతుంది. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలపాలవుతుంది. చెత్త బ్యాటింగ్.. బలహీనమైన బౌలింగ్‌తో గెలిచే మ్యాచ్‌లో కూడా ఓడిపోతుంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ మరీ అధ్వాన్నంగా తయారైంది. గతంలో ఓడిపోయే మ్యాచ్‌ల్లో కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించిన ఆటగాళ్లు ఇప్పుడు తేలిపోతున్నారు. మైదానంలో పరుగులు తీయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాటిగా ఆడలేక టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలపాలవుతున్నారు. ఫలితంగా 7 మ్యాచ్‌ల్లో రెండంటే రెండే గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
రహానేను తీసుకుంటే..?
ఇక చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాటపట్టాలంటే మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్ ద్వారా అజింక్యా రహానేను తీసుకోవాలని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. ‘ఈ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ఆలోచన ఎలా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు క్వాలిటీ టాపార్డర్ బ్యాట్స్ మన్ కావాలి. అజింక్యా రహానేకు మ్యాచ్ ఆడటం కావాలి. రహానేకు ఇంకా అవకాశం దక్కలేదు. మిడ్ నైట్ ఆలోచనలు'అని ట్వీట్ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అవకాశం అందుకున్న రహానే(15) ఆకట్టుకోలేకపోయాడు.

మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ అంటే..?
మిడ్ సీజన్ ట్రాన్స్‌పర్‌లో భాగంగా ఏ జట్టు అయినా తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను ఇతర జట్లకు విక్రయించుకోవచ్చు. అదేవిధంగా ఇతర జట్లు వదిలేసుకునే ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు. అయితే జట్లలో ఉన్న అందరిని వదులుకోవడానికి, తీసుకోవడానికి వీలు ఉండదు. హాఫ్ సీజన్ ముగిసిన తర్వాత ఏడు మ్యాచ్‌లకుగానూ కేవలం ఒకటి లేదా రెండు మ్యాచులు ఆడినవాళ్ళను మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. ఆటగాళ్ళు రెండుకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడితే మాత్రం అమ్మకానికి అవకాశం ఉండదు. ఇక అజింక్యా రహానే ఇప్పటి వరకు కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే అతన్ని చెన్నై తీసుకుంటే బాగుంటుందని హర్షా సూచించాడు.

చెత్త బ్యాటింగ్
ఇక తమ పరాజయాలకు బ్యాటింగ్ వైఫల్యమే కారణమని కెప్టెన్ ధోనీ తెలిపిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీతో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ తమ బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఔటైనా పర్లేదని ధాటిగా ఆడాలని సూచించాడు. నెమ్మదైన బ్యాటింగ్‌తో ఎలాంటి ఫలితం లేదన్నాడు.
‘బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మా బ్యాటింగ్‌లో వేగం పెంచాలి. ఔటైనా సరే భారీ షాట్లు ఆడాలి. తదుపరి మ్యాచ్‌ల్లో అదే వ్యూహంతో బరిలోకి దిగుతాం. ఆరో ఓవర్ నుంచే ధాటిగా ఆడాలి. కానీ మా బ్యాటింగ్‌లో అది కనిపించడం లేదు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన తీరు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత ప్రదర్శనలు ఎన్ని చేసినా తాత్కలికమే. టీమ్ ఎఫర్ట్ ముఖ్యం. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొవడానికి మేం ప్రణాళికలు రచించడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా 6 నుంచి 14 ఓవర్లలో ఎవరూ బౌలింగ్ చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలను రచించలేకపోయాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి షాక్.. లీగ్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications