టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన హర్షా భోగ్లే.. ధావన్, కుల్దీప్‌కు నో చాన్స్!

న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. భారత్ వేదికగా జరగాల్సిన ఈ మెగా టోర్నీ కరోనా కారణంగా యూఏఈకి తరలిన విషయం తెలిసిందే. అయితే దేశం ధాటినా ఈ మెగాటోర్నీ ఆతిథ్య హక్కులు మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దగ్గరనే ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. తేదీలు ఖారారు చేసినా.. షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముగిసిన వెంటనే ఈ మెగాటోర్నీకి తెరలేవనుంది. రెండు దశల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. తొలి దశ ఓమన్ వేదికగా క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత యూఏఈ వేదికగా ప్రధాన లీగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ దేశాలన్ని సమాయత్తం అవుతున్నాయి. బెస్ట్ కాంబినేషన్స్‌తో బరిలో దిగేందుకు కసరత్తులు చేస్తున్నాయి. మెగాటోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా సైతం ఈ సారి టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల సత్తా పరీక్షిస్తోంది. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు సైతం తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిక్‌బజ్ లైవ్ షోలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ పేసర్లు ఆశీష్ నెహ్రా, జహీర్ ఖాన్‌లు ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టుపై తమ అంచనాలను వెల్లడించారు.

ధావన్‌కు నో చాన్స్..
తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ టీమ్‌ను అంచనా వేసాడు. ఇక తాను అంచనా వేసిన జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసిన భోగ్లే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు కచ్చితంగా ఉంటారని, ఐదో బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరూ మెరుగ్గా రాణిస్తే వారికే చాన్స్ ఉంటుందన్నాడు. ఆశ్చర్యకరంగా ఈ వెటరన్ కామెంటేటర్ తన జట్టులో శిఖర్ ధావన్‌కు అవకాశం ఇవ్వలేదు.

భువీ, దీపక్ చాహర్..
హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలతో ముగ్గురు ఆల్‌రౌండర్లను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు చోటిచ్చాడు. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసిన భోగ్లే.. నలుగురు పేసర్లను తీసుకున్నాడు. స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇవ్వగా.. ముగ్గురు పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రాలకు కచ్చితంగా చోటు దక్కుతుందన్నాడు. అయితే నాలుగో పేసర్‌గా మాత్రం మహమ్మద్ షమీ, టీ నటరాజన్‌లో ఒకరికే అవకాశం ఉంటుందన్నాడు. ఇక టీ20లో భారత్ తరఫున 6వ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్‌ను భోగ్లే విస్మరించాడు. శ్రీలంక పర్యటనలో కుల్దీప్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విఫలమయ్యాడు.
Tokyo 2020: ప్చ్.. ఊరించి ఊసురుమనిపించిన సింధు! ఇక బ్రాంజ్ మెడలే దిక్కు!

హర్షా భోగ్లే టీ20 ప్రపంచకప్ 2021:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/టీ నటరాజన్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications