వన్డే చరిత్రలో సంచలనం.. గిల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్!
ట్రై-సిరీస్‌లోని మూడో వన్డేలో శ్రీలంకపై ఇంగ్లండ్ యువ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. హ్యారీ బ్రూక్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి వన్డే క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
114 బంతుల్లో డబుల్ సెంచరీ
హ్యారీ బ్రూక్ కేవలం 114 బంతుల్లోనే తన మెరుపు డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. హ్యారీ బ్రూక్ శ్రీలంక బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా స్టేడియం నలువైపులా బౌండరీలు బాదాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో బ్రూక్ మొత్తం 21 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు కేవలం 96 బంతుల్లోనే తన 150 పరుగులు పూర్తి చేసిన హ్యారీ బ్రూక్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించి ఇంగ్లండ్ తరఫున ఈ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

గిల్ ప్రపంచ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసి శుభ్‌మన్ గిల్ 117 బంతుల మునుపటి రికార్డును బద్దలు కొట్టి వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. బ్రూక్ 116 బంతుల్లో 202 పరుగులు చేసి ఔటయ్యాడు.
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ రావల్పిండి స్టేడియంలో చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరుకు కొత్త రికార్డు నెలకొల్పాడు. హ్యారీ బ్రూక్ అద్భుతమైన మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్ ఆడి బెన్ స్టోక్స్ 182 పరుగుల రికార్డును అధిగమించి ఇంగ్లండ్ వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. బ్రూక్ ఈ విధ్వంసకర చారిత్రాత్మక బ్యాటింగ్ స్టోక్స్ చిరకాల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లీష్ క్రికెట్‌కు ఓ కొత్త శకానికి నాంది పలికింది.
ఇప్పటివరకు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్లు వీరే..
*రోహిత్ శర్మ (భారత్) - 264 పరుగులు (శ్రీలంకపై, 2014)
*మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) - 237* (వెస్టిండీస్‌తో, 2015)
*వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) - 219 పరుగులు (వెస్టిండీస్‌పై, 2011)
*క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 215 పరుగులు (జింబాబ్వేపై, 2015)
*ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) - 210* (వర్సెస్ జింబాబ్వే, 2018)
*ఇషాన్ కిషన్ (భారత్) - 210 పరుగులు (బంగ్లాదేశ్‌పై, 2022)
*పాతుమ్ నిస్సాంక (శ్రీలంక) - 210* (వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, 2024)
రోహిత్ శర్మ (భారత్) - 209 పరుగులు (ఆస్ట్రేలియాపై, 2013)
*శుభ్‌మన్ గిల్ (భారత్) - 208 పరుగులు (న్యూజిలాండ్‌పై, 2023)
*రోహిత్ శర్మ (భారత్) - 208* (శ్రీలంకతో, 2017)
*గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 201* (ఆఫ్ఘనిస్తాన్‌తో, 2023)
*సచిన్ టెండూల్కర్ (భారత్) - 200* (దక్షిణాఫ్రికాపై, 2010)
*హ్యారీ బ్రూక్ (భారత్) - 202 పరుగులు (శ్రీలంకపై, 2026)
రోహిత్ శర్మ పేరిట అత్యధిక డబుల్ సెంచరీలు
వన్డే క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీల ప్రపంచ రికార్డు భారత ఆటగాడు రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ వన్డేలలో ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి ఓ అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. ప్రపంచంలో మరే ఇతర బ్యాటర్ కూడా ఈ ఘనతను ఒక్కసారి కంటే ఎక్కువసార్లు సాధించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


