కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్!(వీడియో)
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళల జట్టు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆమె తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించారు. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో నాకౌట్‌గా 91 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. చాలా కాలంగా సరైన స్కోరు లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు ఈ ఇన్నింగ్స్ వ్యక్తిగతంగా ఎంతో కీలకం.
గత 10 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆ నిరాశనంతటినీ ఈ మ్యాచ్‌లో స్టేడియంలో చూపించారు. మహిళల టీ20 ఆసియా కప్, ఆసియా క్రీడలు 2026లలో భారత్ టైటిళ్లు గెలుచుకున్నప్పటికీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్ మాత్రం నిశ్శబ్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వేపై ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆమె రీ-ఎంట్రీకి బలమైన నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్, జింబాబ్వేపై 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత భారత మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో మాట్లాడుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేడియంలో స్వేచ్ఛగా ఆడుతూ ఆటను ఆస్వాదించాలని రామన్ తనకు చెప్పారని.. తనపై తనకు నమ్మకం ఉంచేలా ప్రోత్సహించినందుకు ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నిర్భయంగా బ్యాటింగ్ చేసేలా చేశాయని ఆమె పేర్కొన్నారు.
తన పాత ఫామ్‌ను తిరిగి సాధించడంలో బ్యాటింగ్ కోచ్ హిమాంశు పాత్ర కూడా చాలా ఉందని హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించారు. ఐచి-నాగోయ్ ఆసియా క్రీడలు 2026 తర్వాత నెట్స్‌లో తీవ్రంగా శ్రమించానని, తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవడంలో కోచ్ అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన ఈ విజయం ఆమెకు ఎంతటి ఉపశమనాన్ని ఇచ్చిందో స్టేడియంలో ఆమె చూపించిన భావోద్వేగాలే స్పష్టం చేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


