Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా, చెన్నై కాదు.. హార్దిక్ పాండ్యాకు ఆ టీమే పర్ఫెక్ట్: మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2027 వేలానికి ముందే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. వచ్చే సీజన్ లో వేరే జట్టుకు మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్, లేదా కోల్‌కతా నైట్ రైడర్స్ వైపు వెళ్తాడని పుకార్లు వినిపిస్తున్నప్పటికీ..హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఒకవేళ సీఎస్కేలోకి వస్తే జట్టు బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుందని.. అయితే అలాంటి డీల్ జరిగే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశాడు. చెన్నై దిగ్గజం ఎంఎస్ ధోనీ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పాడు. అలాగే కేకేఆర్ లోకి మారే వార్తల్లో కూడా వాస్తవం లేదని.. రాజస్థాన్ రాయల్స్ మాత్రమే హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు సరైన జట్టుగా కనిపిస్తోందని తన వ్యక్తిగత అంచనాను వెల్లడించాడు.

Hardik Pandya Trade to Rajasthan Royals Ravichandran Ashwin Predicts MI Captain IPL 2027 Destination

గతంలో రాజస్థాన్ రాయల్స్ హార్దిక్ పాండ్యాను తీసుకుని బదులుగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ముంబైకి ఇచ్చేలా ట్రేడింగ్ చర్చలు జరిపినప్పటికీ.. ఆ డీల్ ఫైనల్ కాలేదని వార్తలు వచ్చాయి. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో పాటు హార్దిక్ పాండ్యాకు, యాజమాన్యం, జట్టులోని ఇతర ఆటగాళ్లకు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు రావడంతో హార్దిక్ పాండ్యా ముంబైని వీడటం ఖాయంగా కనిపిస్తోంది.

6, 4, 6, 1, 6: వాన రాకపోయి ఉంటే.. వెస్టిండీస్ బౌలర్ల పని ఖతమే!

Also Read

6, 4, 6, 1, 6: వాన రాకపోయి ఉంటే.. వెస్టిండీస్ బౌలర్ల పని ఖతమే!

మరోవైపు హార్దిక్ పాండ్యా గతంలో తన సారథ్యంలో 2022లో టైటిల్ అందించిన, 2023లో రన్నరప్‌గా నిలిపిన గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తిరిగి వెళ్తాడమే ప్రచారం కూడా నడిచింది. అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ కు సంబంధించి ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Story first published: Sunday, October 18, 2026, 15:07 [IST]
Other articles published on Oct 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+