ఏం కర్మరా బాబు...
పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని రీట్వీట్ చేసిన భజ్జీ.. ఇప్పటికే కరోనాతో ఏగలేకపోతున్నామంటే మరోకటి తయారు చేసారా? అని డ్రాగన్ కంట్రీపై ధ్వజమెత్తాడు. ‘యావత్ ప్రపంచం కరోనాతో ఏగలేక సతమతమవుతుంటే.. వాళ్లేమో మన కోసం మరో వైరస్ సిద్దం చేశారు'కర్మరా బాబు అనే ఎమోజీలతో ట్వీట్ చేశాడు.

ఆధిపత్యం కొరకే ఈ బయోవార్..
ప్రపంచంపై ఆధిపత్యం కొరకే చైనా ఈ బయోవార్‌కు తెరలేపిందని చాలా మంది భావిస్తున్నారు. ఇక క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు చూస్తుంటే చైనా కుట్రే అనిపిస్తుందని రైనా తెలిపాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే.. మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో ఎలా అదుపులోకి వచ్చిందని, ఇది పక్కా డ్రాగన్ కంట్రీ సృష్టించిందేనని చాలా మంది నెటిజన్లు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రారంభంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది చైనా సృష్టేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

పందుల్లో మరో వైరస్..
ఇక పందుల్లో గుర్తించిన స్వైన్ ప్లూ తరహా వైరస్‌కు మహమ్మారిగా మారేందుకు అన్ని లక్షణాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతానికి తమ దేశంలోని పందుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది మనుషులకు అవలీలగా సంక్రమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జీ4గా గుర్తింపు పొందిన ఈ వైరస్ హెచ్1ఎన్1 నుంచి సంక్రమించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. చైనాలో 10 ప్రావిన్స్‌ల్లో గల పందుల వధ శాలల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా ఈ వైరస్ జాడ తేలినట్లు తెలిపారు.

ధృవీకరించిన అమెరికా..
ఈ వైరస్ ఆశ్చర్యకంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థకు చెందిన సెంటర్ ఫర్ పిగ్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ బయాలజిస్ట్ మార్థా నెల్సన్ తెలిపారు. దీని తీవ్రత ప్రస్తుతం తక్కువ స్థాయిలోనే ఉందని అన్నారు. ఆ సమయంలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ తరహాలోనే దీనికి కూడా ఎలాంటి మందులు లేవని చెప్పారు.
అపహాస్యం పాలైన పాక్.. 'పాకియతాన్' ఎక్కడుందంటూ పీసీబీని ఆడుకుంటున్న నెటిజన్లు!


Click it and Unblock the Notifications












