న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హే నటాషా.. నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Asks Natasa Stankovic From Where Are You Getting The Glow

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌‌‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. తాజాగా ఆమెతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్.. నటాషా అందాన్ని కొనియాడాడు. 'హే నటాషా.. నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా'అని చిలిపిగా ప్రశ్నించాడు.

హార్దిక్ నీ ప్రేమే..

హార్దిక్ నీ ప్రేమే..

దీనికి బాలీవుడ్ బ్యూటీ, నటాషా కూడా చాలా క్యూట్‌గా సమాధానమిచ్చింది. తన సౌందర్యం క్రెడిట్ అంతా హార్దిక్‌దేనని తెలుపుతూ.. ‘హార్దిక్.. నీ ప్రేమ వాత్యల్యమే నా ముఖంలోని గ్లోకు కారణం'అని అంతే ప్రేమతో బదులిచ్చింది. ఇన్‌స్టా వేదికగా వీరి మధ్య నడిచిన కామెంట్ల ప్రేమయానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘లవ్లీ కపుల్.. సో క్యూట్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన ఈ జోడీ.. లాక్‌డౌన్‌లో త్వరలోనే ఓ బిడ్మికు జన్మనివ్వనున్నామని వెల్లడించారు.

అయితే ఈ జంట దండలు మార్చుకున్న ఫొటో ఒకటి వైరల్ కాగా.. వీరి పెళ్లిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పెళ్లికాకుండానే పేరెంట్స్ అయ్యారని అందరూ భావిస్తున్నారు.

‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని హార్దిక్‌ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

వెన్ను గాయంతో దూరమై..

వెన్ను గాయంతో దూరమై..

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీ సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా రద్దు అయింది.

దేశవాళీ టోర్నీలో వీరవిహారం..

దేశవాళీ టోర్నీలో వీరవిహారం..

ఇక తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో పాండ్యా రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీ డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్‌.. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకుముందు కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.

ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.

ధోనీని రిప్లేస్ చేయడం అంత ఈజీకాదు.. పంత్‌కు మా ఫుల్ సపోర్ట్: బ్యాటింగ్ కోచ్

Story first published: Saturday, June 27, 2020, 18:25 [IST]
Other articles published on Jun 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X