Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్‌కు ఖాన్‌లున్నారు.. నాకు తమిళ, పంజాబీ సినిమాలు చాలు: భజ్జీ

Harbhajan Singh Talks About Tamil Debut Film Friendship

ముంబై: క్రికెట్‌లో తన దూస్రా బంతులతో వికెట్లు పడగొట్టిన భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. వెండితెరపై యాక్టర్‌గా తన ప్రతిభను చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పంజాబీలో పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ భారత స్పిన్నర్.. ఓ తమిళ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున 'ఫ్రెండ్‌షిప్'అనే సినిమాలో హర్భజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

అక్కడ ఖాన్‌లున్నారు..

అక్కడ ఖాన్‌లున్నారు..

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ ఆసక్తికకర వ్యాఖ్యలు చేశాడు. తమిళ ప్రేక్షకుల నుంచి తనకు లభించిన ఆదరణ ఎప్పటకీ మర్చిపోలేనన్నాడు. అయితే బాలీవుడ్‌లో ఎప్పుడు అడుగుపెడుతున్నారనే ప్రశ్నకు భజ్జీ సరదగా సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్‌ సినిమాలను ఖాన్‌లకు వదిలేస్తున్నాను.. నాకు తమిళ, పంజాబీ సినిమాలు చాలు'అంటూ హర్భజన్ చమత్కరించాడు.

జట్టులోకి ఎంపిక చేయలేదని ఆ రాత్రంతా ఏడ్చా: విరాట్ కోహ్లీ

నా భార్య వద్దన్నా..

నా భార్య వద్దన్నా..

పంజాబి చిత్రాల్లో కొన్ని పాత్రలు చేశానని కానీ ఇదే తన పూర్తి స్థాయి చిత్రమని భజ్జీ తెలిపాడు. చాలా మంది క్రికెటర్లు వెండితెరపై తమ అద్భుష్టాన్ని పరీక్షించుకొని, విఫలమయ్యారనే విషయం తనకు తెలుసన్నాడు. ఇక నటి అయిన తన సతీమణి గీతా బాస్రా కూడా క్రికెట్ కంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుందని, సినిమాల జోలికి రావద్దని కూడా చెప్పిందన్నాడు. కనీసం సినిమాల్లో నటించామనే అనుభవమన్నా దక్కుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ భారత స్పిన్నర్ తెలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ మినహా తనకు దక్కే 10 నెలల్లో ఏదో ప్రయోగం చేయాలనే తపనతో సినీ రంగం వైపు వచ్చినట్లు భజ్జీ చెప్పుకొచ్చాడు.

స్టూడెంట్‌గా భజ్జీ..

స్టూడెంట్‌గా భజ్జీ..

ఈ చిత్రంలో లోస్లియా మరియాసేన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నటుడు అర్జున్‌ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్‌ స్టూడెంట్‌గా హర్భజన్‌ సింగ్‌ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘స్కూలింగ్‌ తర్వాత కొంత గ్యాప్‌ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్‌ సింగ్‌. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవడం కోసం పంజాబ్‌ నుంచి కోయంబత్తూర్‌ వచ్చి ఓ కాలేజ్‌లో జాయిన్‌ అవుతారు హర్భజన్‌. కోయంబత్తూర్‌కే హర్భజన్‌ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్‌ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌కి ముందే తొలి షెడ్యూల్‌ పూర్తయింది. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం'అని చిత్రబృందం పేర్కొంది.

 తమిళ్ రాకున్నా..

తమిళ్ రాకున్నా..

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో తమిళ ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ కురిపించారని హర్భజన్ తెలిపాడు. తమిళ భాష తనకు ఏ మాత్రం తెలియదని.. సినిమాలో నటిస్తున్న సమయంలో ఎటువంటి సహాయం లేకుండా షూటింగ్ చేశానని అతను స్పష్టం చేశాడు.

Story first published: Thursday, April 23, 2020, 10:33 [IST]
Other articles published on Apr 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+