మైమరిపించే ద్రవిడ్ ఫీల్డింగ్ విన్యాసాలు.. వావ్ అంటూ నోరెళ్లబెట్టిన మాజీ ఆటగాళ్లు!

న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఓ అద్భుత క్యాచర్ అంటూ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొనియాడాడు. దివాల్‌లోని సూపర్ ఫీల్డర్‌ను తలుచుకున్న భజ్జీ.. ఈ మాజీ ఆటగాడి సెన్సేషనల్ క్యాచ్‌లకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక రెండు నిమిషాల ఐదు సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ద్రవిడ్ మైమరిపించే సూపర్ క్యాచ్‌లు ఉన్నాయి.
ముఖ్యంగా ఫార్వార్డ్, స్వ్కేర్ లెగ్, ఇన్ ది స్లిప్ కార్డన్, పాయింట్ దిశల్లో ఫీల్డింగ్ చేస్తూ.. అతను అద్భుతంగా అందుకున్న క్యాచ్‌లు ఔరా అనిపిస్తున్నాయి. తన వన్డే, టెస్ట్, ఐపీఎల్‌కు కెరీర్‌కు సంబంధించిన అన్ని క్యాచ్‌లతో ఉన్న ఈ వీడియోను భజ్జీ ట్వీట్ చేస్తూ..'ఔట్ స్టాండింగ్ క్యాచర్'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
సెన్సేషనల్..
ఇక ఈ వీడియోను చూసి ముగ్ధులైన మాజీ ఆటగాళ్లు ద్రవిడ్‌లోను ఫీల్డర్‌ను గుర్తు చేసుకుంటూ కొనియాడుతున్నారు. హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ సెన్సేషనల్ అనగా.. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ‘నిజంగా బ్రిలియంట్'అంటూ ప్రశంసించాడు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. జస్ట్ వావ్ అంటూ నోరెళ్ల బెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

చెక్కు చెదరని రికార్డు..
ఇక క్యాచ్‌ల విషయంలో రాహుల్ ద్రవిడ్‌కు మంచి రికార్డు ఉంది. టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇంకా అతనే టాప్‌లో ఉన్నాడు. 2012లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. అతని క్యాచ్‌ల రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. టెస్ట్‌ల్లో మొత్తం 210 క్యాచ్‌లు పట్టి ద్రవిడ్ టాప్‌లో కొనసాగుతుండగా.. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే(205), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్ (2003) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

నాలుగోవాడు..
ఇక వన్డేల్లో మాత్రం భారత్ తరఫున నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్(140), విరాట్ కోహ్లీ(128), ద్రవిడ్ (124) కన్నా ముందున్నారు. ఇక భారత్ తరఫున 164 టెస్ట్‌లు, 344 వన్డేలు, ఒక టీ20 ఆడిన దివాల్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 13288, 50ఓవర్ల ఫార్మాట్‌లో 10899, ఏకైక టీ20లో 31 పరుగులు చేశాడు. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 73 వన్డేలకు కీపర్‌గా వ్యవహరించి 84 డిస్మిసల్స్‌లో పాలుపంచుకున్నాడు. ఇందులో 74 క్యాచ్‌లు, 13 స్టంపింగ్స్ చేశాడు.
భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్.. డేవిడ్ వార్నర్‌ను టీజ్ చేసిన అశ్విన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications