Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్.. డేవిడ్ వార్నర్‌ను టీజ్ చేసిన అశ్విన్

Ravichandran Ashwin trolls David Warner following TikToks ban in India

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో చైనా వస్తువులు, మొబైల్ అప్లికేషన్స్ నిషేదించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కార్ సోమవారం ప్రకటించింది.

 అయ్యో.. వార్నర్..

అయ్యో.. వార్నర్..

ఈ నిషేధయాప్‌ల జాబితాలో భారత్‌లో బాగా ప్రాచూర్యం పొందిన టిక్‌టాక్ కూడా ఉంది. ఇక టిక్‌టాక్ భారత్‌లో బంద్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ను భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీజ్ చేశాడు. ‘అప్పో అన్వర్.. డేవిడ్ వార్నర్'అంటూ చింతిస్తున్న ఎమోజీని ట్వీట్ చేశాడు. ఇక.. అశ్విన్ చేసిన ట్వీట్ లోని‘అప్పో అన్వర్' డైలాగ్ రజినీకాంత్ భాషా చిత్రంలోనిది కావడం గమనార్హం. ఇక 59 యాప్ నిషేధం గురించి ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అశ్విన్ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఆస్ట్రేలియాలో ఉంది కదా..

ఆస్ట్రేలియాలో ఉంది కదా..

ఇక అశ్విన్ ట్వీట్‌కు అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. నిషేధం భారత్‌లోనే కదా.. ఆస్ట్రేలియాలో ఉంది కదా? అని ఒకరంటే.. అశ్విన్.. నీవు చహల్‌ను మరిచిపోయావ్ తెలుసా? అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరికొందరూ తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిపెట్టి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక టిక్‌టాక్‌ నిషేధంతో వార్నర్ అభిమాన గణం తగ్గిపోయిందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

లాక్‌డౌన్ టిక్‌టాక్ స్టార్..

లాక్‌డౌన్ టిక్‌టాక్ స్టార్..

ఇక కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన డేవిడ్ వార్నర్.. టిక్‌టాక్ స్టార్‌గా భారత అభిమానులు మనసులు దోచుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు సతీమని క్యాండిస్‌, తన కూతుళ్లతో కలిసి చిందేసిన వార్నర్.. టాలీవుడ్ హీరోల, అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. తనదైన టిక్‌టాక్‌లతో తెలుగు ప్రజలను ఊర్రూతలూగించాడు. టాలీవుడ్ దర్శకుల నుంచి సినీ ఆఫర్స్ అందుకున్నాడు.

 బుట్టబొమ్మతో మొదలు..

బుట్టబొమ్మతో మొదలు..

అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంటపురంలో' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ టిక్‌టాక్ చేయగా.. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో అదే సినిమాలోని 'రాములో రాములా' పాటకు చిందేసిన వార్నర్ దంపతులు.. అది కూడా సూపర్ హిట్ కావడంతో మధ్యలో పోకిరి, బాహుబలి డైలాగ్‌లతోనూ ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజున పక్కాలోకల్ సాంగ్‌తో నందమూరి అభిమానులకు ఊహించని బహుమతి ఇచ్చాడు‌.అవెంజర్స్‌, ముక్కాబులా, మైండ్ బ్లాక్ పాటలకు కూడా టిక్‌టాక్ చేసాడు.

ఇదేం పద్దతి ఐసీసీ.. ధోనీ బలిదాన్ బ్యాడ్జ్ వద్దని ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌‌'కు అనుమతా?

Story first published: Tuesday, June 30, 2020, 12:56 [IST]
Other articles published on Jun 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+