న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ గైర్హాజరీతో ఆ ఇద్దరికి మంచి అవకాశం: హర్భజన్ సింగ్

Harbhajan Singh says Virat Kohlis absence can open window for KL Rahul and Pujara
IND vs AUS 2020 : Virat Kohli's Absence Can Open Window For KL Rahul And Pujara - Harbhajan Singh

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ మొత్తానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారాలకు సువర్ణావకాశమని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఫస్ట్ టెస్ట్ అనంతరం పెటర్నిటీ లీవ్‌తో విరాట్ కోహ్లీ భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే కోహ్లీ గైర్హాజరీ భారత విజయవకాశాలపై ప్రభావం చూపుతుందని, కానీ ఇతర బ్యాట్స్‌మెన్ కోహ్లీ లేని లోటు తీరుస్తూ బాధ్యత తీసుకోవాలని భజ్జీ సూచించాడు.

గ్యారంటీ లేదు.. కానీ..

గ్యారంటీ లేదు.. కానీ..

తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన హర్భజన్.. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో భారత జట్టు గత పర్యటన ఫలితాన్ని రిపీట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నాడు. ‘ఫస్ట్ టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ భారత్ తిరిగి రావడం.. చాలా రోజుల తర్వాత టెస్ట్‌‌ల్లో అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్‌కు మంచి అవకాశం.

ఓ రకంగా అతనికిది ఓపెన్ విండోలాంటిది. అతని గైర్హాజరీతో రాహుల్‌కు తుది జట్టులో చోటు ఖాయం. ఇక విరాట్ కోహ్లీ చాలా పెద్ద ఆటగాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎప్పుడూ వెళ్లినా అతను పరుగులు చేశాడు. అతను గైర్హాజరీ భారత జట్టుకు ప్రతికూలమే. కానీ ఇతర ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం.

ఆ విషయాన్ని మరవద్దు...

ఆ విషయాన్ని మరవద్దు...

ముఖ్యంగా కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారాలకు తమ సత్తా చాటే క్షణం. పెద్ద ప్లేయర్లు అయిన రాహుల్, పుజారా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. భారత ఆటగాళ్లంతా విరాట్ కోహ్లీ లేడనే విషయాన్ని మరిచిపోకూడదు. తాము ఆస్ట్రేలియా గడ్డపై ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం కోసం గతేడాది ఏం చేశారో దాన్ని రిపీట్ చేయాలి'అని భజ్జీ సూచించాడు.

రోహిత్ ఓపెనింగ్..

రోహిత్ ఓపెనింగ్..

ఈ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఓపెనింగ్ పెద్ద విషయమేనని భజ్జీ అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌లోనే టెస్ట్ ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న రోహిత్.. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో స్వదేశంలో చెలరేగాడు. అయితే ఇప్పటి వరకు అతను సంప్రదాయక ఫార్మాట్‌లో ఓపెనర్‌గా విదేశాల్లో ఆడలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికైనా.. గాయంతో మధ్యలోనే నిష్క్రమించాడు. ఈ క్రమంలోనే రోహిత్ ఓపెనింగ్ పెద్ద విషయమని భజ్జీ చెప్పుకొచ్చాడు. కేవలం టెస్ట్‌లకు మాత్రమే ఎంపికైన రోహిత్ ప్రస్తుతం ఎన్‌సీఏలో చికిత్స పొందుతున్నాడు. అతను మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

ఛీ ఛీ నాకు బాయ్ ఫ్రెండా?.. అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో: మహిళా క్రికెటర్

Story first published: Thursday, November 19, 2020, 16:06 [IST]
Other articles published on Nov 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X