న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతను ఇండియన్ ఏబీడీ.. ఆసీస్ టూర్‌కు ఎంపికవ్వాల్సింది: హర్భజన్ సింగ్

Harbhajan Singh Says Suryakumar Yadav is the Indian AB de Villiers
Suryakumar Yadav Is Indian AB de Villiers - Harbhajan Singh | Oneindia Telugu

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్‌పై టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య బ్యాటింగ్ అద్భుతమని, అతను భారత ఏబీ డివిలియర్స్ అని కొనియాడాడు. అన్ని షాట్లు ఆడే సత్తా అతనికి ఉందన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన భజ్జీ.. సూర్య ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతనో అసాధారణ ఆటగాడని, త్వరలోనే టీమిండియాలోకి వస్తాడని జోస్యం చెప్పాడు.

గేమ్ చేంజర్..

గేమ్ చేంజర్..

‘సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ గేమ్ చేంజర్‌గా మారడనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్‌లో అతను చాలా బాధ్యత తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ నుంచే ధాటిగా ఆడుతూ మంచి స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. ఈ సీజనే కాదు గత మూడు సీజన్లలో సూర్య తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై జట్టులో చేరినప్పటి నుంచి పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018, 2019 సీజన్లలో 512, 424 పరుగులు చేశాడు.

సెలెక్ట్ చేయాల్సింది..

సెలెక్ట్ చేయాల్సింది..

సూపర్ ఫామ్‌లో ఉన్న అతను టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వాల్సింది. అన్ని షాట్లు ఆడే అతన్ని సెలెక్ట్ చేయకపోవడం బాలేదు. ఓవర్స్ కవర్స్, స్వీప్ షాట్స్ ఆడగలడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. సూర్య భారత డివిలియర్స్. అతను భారత జట్టులోకి ఎంపికవ్వాల్సింది. కానీ అలా జరగలేదు. అయితే అదెంతో దూరంలో లేదు. అతనో అసాధరణ ఆటగాడు.'అని భజ్జీ కొనియాడాడు.

అదరగొట్టిన ‘స్కై'..

అదరగొట్టిన ‘స్కై'..

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ ముంబై ఇండియన్స్ గెలవడంలో సూర్య కుమార్ యాదవ్ (స్కై) కీలక పాత్ర పోషించాడు. మూడో నంబర్‌లో ఆడుతూ జట్టుకు అద్భుత విజయాలందించాడు. దాంతోనే ఈ సీజన్‌లో స్కై టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. తనదైన షాట్లతో చెలరేగి 16 మ్యాచ్‌ల్లో 145.01 స్ట్రైక్‌రేట్ 480 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్ విన్నర్‌గా మారాడు. అయితే ఇంత అద్భుత ప్రదర్శన కనబర్చిన స్కైకి ఆసీస్ టూర్‌కు వెళ్లే అవకాశం దక్కలేదు. దాంతో చాలా మంది అభిమానులు, మాజీ క్రికెటర్లు టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డారు.

IPL 2021: కొత్త జట్టుపై ఫ్రాంచైజీల్లో కలవరం.. ఐదుగురు ఫారిన్ ప్లేయర్లకు అవకాశం!

Story first published: Friday, November 13, 2020, 14:12 [IST]
Other articles published on Nov 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X