Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: కొత్త జట్టుపై ఫ్రాంచైజీల్లో కలవరం.. ఐదుగురు ఫారిన్ ప్లేయర్లకు అవకాశం!

IPL 2021: BCCI official suggests increasing overseas players limit from 4 to 5 as for new teams
IPL 2020 Award Winners List, Stats, Prize Money | Oneindia Telugu

ముంబై: ఐపీఎల్ 2020 సీజన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఖాళీ స్టేడియాల్లో జరిగినా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. విజేత, పరాజితుల గురించి పక్కన పెడితే అభిమానులను అలరించడంలో మాత్రం లీగ్‌ ఎక్కడా తగ్గలేదు. కోవిడ్‌-19 సమయంలో అభిమానులకు ఈ టోర్నీ పూర్తి వినోదాన్ని పంచింది. అయితే మరో నాలుగు నెలల్లో ఐపీఎల్‌-2021 జరగాలి. సమయం తక్కువగా ఉన్నా తప్పనిసరిగా ఏప్రిల్, మే నెలల్లోనే నిర్వహించాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాదిలా 2021లో ఐపీఎల్‌ వాయిదా వేస్తే కుదరదు. అందుకే వెంటనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్‌ పాలకమండలి వచ్చే సీజన్‌పై కసరత్తు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే వచ్చే సీజన్‌లో 8 జట్లు కాకుండా 9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

మెగా వేలం..

మెగా వేలం..

అలాగే పాక్షిక వేలం కాకుండా వచ్చే సీజన్‌ కోసం మెగా వేలాన్ని నిర్వహించాలా అనే దానిపై కూడా బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లందరినీ వేలానికి తెస్తారు. అప్పుడు జట్ల రూపురేఖలు మారొచ్చు. అయితే ఇది కేవలం ప్రతిపాదనే అని దీనిపై ఇంకా చర్చగానీ, నిర్ణయం కానీ తీసుకోలేదు. ‘రెండు నెలల్లో జరిగే వేలానికి సిద్ధంగా ఉండాలంటూ బీసీసీఐ మాకు సమాచారం ఇచ్చింది. అధికారికంగా తెలపకపోయినా... మరో జట్టు చేరే అవకాశమున్నట్లు మాకూ తెలిసింది' అని ఒక ఫ్రాంచైజీ ఉన్నతాధికారి వెల్లడించారు.

అహ్మదాబాద్ బేస్ట్..

అహ్మదాబాద్ బేస్ట్..

లక్షా 10 వేల మంది సామర్థ్యం కలిగిన సర్దార్‌ పటేల్‌ స్టేడియం వేదికగా అహ్మదాబాద్‌ బేస్ట్ ఫ్రాంచైజీ కొత్తగా రానుందని, బడా కార్పొరేట్‌ సంస్థలు దీనిపై కన్నేశాయని కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో వేలం ఎలా వుంటుందో, ఆటగాళ్ల రిటైన్ పాలసీ (అట్టిపెట్టుకునే విధానం) ఏ విధంగా మారుతుందోననే చర్చ మొదలైంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తారా లేదంటే అందరీని వేలంలోకి తేస్తారా అనే విషయంపై బోర్డు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్త ఫ్రాంచైజీ వస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని ప్రస్తుత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి.

రెవెన్యూ లోటు..

రెవెన్యూ లోటు..

కొత్త జట్టు రాకతో ఆర్థికంగా కూడా తాము నష్టపోతామని ప్రస్తుత ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లీగ్‌కు సంబంధించి పలు కంపెనీలతో బీసీసీఐ 2023 వరకు ఒప్పందాలు చేసుకుంది. ఇవి ఇప్పటికిప్పుడు మార్చుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్నే కొత్త జట్టుకు పంచాల్సి ఉంటుంది. అప్పుడు తమకు వచ్చే డబ్బులో కోత పడుతుందని ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. అలాగే లీగ్ క్వాలిటీ కూడా తగ్గుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే చాలా టీమ్స్ నలుగురు ఫారిన్ ప్లేయర్లనే ఆడించాలనే నిబంధనతో టీమ్‌ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాయి. కొత్త జట్టు వస్తే ఈ సమస్య మరింత పెరుగుతుందని, నాణ్యమైన భారత ఆటగాళ్లను అన్ని జట్లు పంచుకుంటాయని భావిస్తున్నాయి.

ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు ఆడిస్తే..

ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు ఆడిస్తే..

ఐదుగురు ఫారిన్ ప్లేయర్లను ఆడిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లేనని ఓ బీసీసీఐ అధికారి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత నిబంధన కారణంగా చాల మంది ఫారిన్ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం అవుతున్నారని, జట్లు ఎక్కువైనా క్వాలిటీ ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారని, ఐదుగురిని ఆడిస్తే లీగ్ క్వాలిటికీ డోకా ఉండదన్నాడు. ‘ప్రస్తుత నిబంధన కారణంగా చాలామంది ఫారిన్ ప్లేయర్లు ప్రతీ సీజన్‌లో బెంచ్‌కే పరిమితం అవుతున్నారు. మరో ఫారిన్ ప్లేయర్‌ను ఆడే అవకాశం కల్పిస్తే జట్లన్నీ సమతూకంగా ఉంటాయి'అని సదరు అధికారి తెలిపాడు.

Story first published: Friday, November 13, 2020, 16:01 [IST]
Other articles published on Nov 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+