రోహిత్ శర్మ క్రీజులో 5 ఓవర్లు ఉంటే చాలు.. సెహ్వాగ్‌లానే చెలరేగుతాడు: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్ టెస్ట్ టీమ్‌కు ఎంపికైన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 5 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా చెలరేగుతాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు హిట్‌మ్యాన్ చాలా కీలకమవుతాడని తెలిపాడు. తాజాగా ఓ మీడియా చానెల్‌తో మాట్లాడిన భజ్జీ భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆపడం కష్టం..
'5 ఓవర్ల పాటు రోహిత్ క్రీజులో ఉంటే తర్వాత అతన్ని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే అతనో ప్రమాదకర బ్యాట్స్‌మన్. రోహిత్ అన్ని షాట్లూ ఆడగల సమర్థుడు. హిట్‌మ్యాన్ లాంటి ప్లేయర్‌కు ఆస్ట్రేలియాలో పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. అయితే, అతను కొత్త బంతిని ఎదుర్కోవడమే చాలా ముఖ్యం. దాన్ని ఆడగలిగితే.. సెహ్వాగ్ లాగే అతను విధ్వంసం సృష్టించగలడు. రోహిత్ ఫస్ట్ టెస్టుకు ముందే పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా' అని భజ్జీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌పై భారీ అంచనాలు ఉంటాయని హర్భజన్ చెప్పుకొచ్చాడు. గతేడాది స్వదేశంలో ఎలా చెలరేగాడో ఆస్ట్రేలియా పర్యటనలోనూ అలాగే రెచ్చిపోతాడని అభిమానులు ఆశిస్తున్నట్లు తెలిపాడు.

పంత్ చెలరేగుతాడు..
ఇక రిషభ్ పంత్ గురించి భజ్జీ మాట్లాడుతూ.. ఈ యువ కీపర్, బ్యాట్స్‌మన్ మళ్లీ మూడు ఫార్మాట్లలో ఆడతాడనే నమ్మకం ఉందని చెప్పాడు. ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా పంత్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునే విషయంలో అతడు తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నేపథ్యంలో అక్కడ రాణించి మళ్లీ జట్టులో కొనసాగుతాడని భజ్జీ జోస్యం చెప్పాడు.

భవిష్యత్తులో బాగా ఆడుతాడు..
'పంత్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయితే, అతనింకా యువ ఆటగాడే. అదీ కాక తనలో ఆడే సత్తా ఉంది. భవిష్యత్‌లో బాగా ఆడతాడు. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లోనూ సరైన పరుగులు చేయలేకపోయాడు. కానీ, అతనో మంచి క్రికెటర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అతనికి మూడు ఫార్మాట్లలో కొనసాగాలనే ఆశ ఉంటే పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. తన శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవాలి. సమీప భవిష్యత్‌లో అతను రాణిస్తాడనే నమ్మకం ఉంది' అని భజ్జీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ధోనీ సతీమణి సాక్షి సింగ్ బర్త్ డే వేడుకల్లో పాక్ క్రికెటర్!