For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా చాలా నేర్పింది.. పేదల కోసం వ్యవసాయం చేస్తా: హర్భజన్

Harbhajan Singh says Covid-19 crisis has taught me a lot

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా అందరికి ఓ గుణపాఠం నేర్పిందని, జీవిత కాలానికి సరిపోయే ఎన్నో విషయాలను తెలియజేసిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. అలాగే ఈ మహమ్మారి తనలోని మానవత్వాన్ని తట్టిలేపిందన్నాడు. ఇతరులు సహాయపడగలననే విషయాన్ని తెలియజేసిందన్నాడు. ఇండియా టుడే సలాం క్రికెట్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ.. ఈ కరోనా కాలంలో ఇతరుల బాధలు, కష్టాలు చూసి చలించిపోయానన్నాడు.

మానవత్వాన్ని తట్టి లేపింది..

మానవత్వాన్ని తట్టి లేపింది..

ఈ కరోనా మహమ్మారి తనలో మానవత్వాన్ని తట్టిలేపిందని, అందుకే కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాని చెప్పాడు. ఇలా మన సమాజంలోని పేదలకు సాయం చేయాలని భావిస్తున్నాని భజ్జీ ప్రకటించాడు. కేవలం డబ్బు సంపాదించడానికే మనం బతకడం లేదని, ఇతరులకు సాయం చేయడం కూడా మన బాధ్యత అని స్పష్టంచేశాడు.

పేదల కోసం వ్యవసాయం చేస్తా..

పేదల కోసం వ్యవసాయం చేస్తా..

‘కరోనా నాకు ఎన్నో విషయాలు నేర్పింది. నాలో మానవత్వాన్ని తట్టిలేపింది. గతంలో కంటే ఇప్పుడు ఇతరులు కష్టాలను చూసి చలించిపోతున్నా. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మనందరి బాధ్యత. ఆ దేవుడి దయతోనే మనం మంచి స్థితిలో ఉన్నాం. ఇప్పటికే నాకు చేతనైనంత సాయం చేశాను. నాతో పాటు నా స్నేహితులు కూడా పేదలకు రేషన్ సరుకులు అందజేశారు. వలస కూలీలు ఇంటికి చేరడానికి సహాయపడ్డారు. నేను కూడా మా ఊరిలో ఓ పొలం కొని పంటలు పండిస్తా. వాటిని పేద ప్రజలకు పంచిపెడ్తా. ఈ సమాజానికి మనం తిరిగియాల్సిన విపత్కర పరిస్థితి ఇది.'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఇక దేశంలోని పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని భజ్జీ కోరాడు. కరోనాను కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలన్నాడు. దేశానికి మన అవసరం ఉందన్నాడు. అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చాడు.

టీ20 వరల్డ్‌కప్ నిర్వహిస్తుంది...

టీ20 వరల్డ్‌కప్ నిర్వహిస్తుంది...

ఇక ఇంగ్లండ్‌లో వెస్టిండీస్ టూర్ సక్సెస్ అయితే అక్టోబర్ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌‌‌కు లైన్ క్లియర్ అవుతుందని భజ్జీ అన్నాడు. కరోనాను కట్టడి చేసిన ఆసీస్‌కు టీ20 ప్రపంచకప్ నిర్వహించే సామర్థ్యం కూడా ఉందన్నాడు. కొన్ని నెలల నుంచి భిన్నంగా కనిపిస్తున్న ప్రపంచం, భవిష్యత్తులో మరింత విభిన్నంగా ఉంటుందన్నాడు.

చాలా సంతోషం..

చాలా సంతోషం..

‘వెస్టిండీస్ టీమ్ ఇప్పుడు ఇంగ్లండ్ ఉండటం మంచి విషయం. క్రికెట్ పున:ప్రారంభమవడం గుడ్ న్యూస్. రెండు జట్ల మధ్య ఇదో ట్రయల్ సిరీస్ కానుంది. ఒకవేళ అది సక్సెస్ అయితే టీ20 ప్రపంచకప్‌కు కూడా తలుపులు తెర్చుకుంటాయి. ఇంగ్లండ్ ఓ సిరీస్ నిర్వహించినప్పుడు ఆస్ట్రేలియా కూడా వరల్డ్ కప్ నిర్వహిస్తుంది.'అని హర్భజన్ అన్నాడు.

కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్

Story first published: Sunday, June 14, 2020, 9:58 [IST]
Other articles published on Jun 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+