Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను చూసిన ఆటగాళ్లలో అతనే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్: చాపెల్

Greg Chappell Says MS Dhoni most powerful batsman I have seen

న్యూఢిల్లీ: క్రికెట్‌ చరిత్రలో ఇప్ప‌టివ‌ర‌కు తాను చూసిన ఆట‌గాళ్ల‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీనే అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ అని టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ తెలిపాడు. జార్ఖండ్ డైనమైట్ కెరీర్ ఆరంభంలో భార‌త్‌కు హెడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ధోనీ బంతిని బాదే విధానానికి ముగ్దుడైన‌ట్లు చెప్పుకొచ్చాడు.

ఆ క్షణమే ప్రపంచం ఓ గొప్ప క్రికెటర్..

ఆ క్షణమే ప్రపంచం ఓ గొప్ప క్రికెటర్..

‘తొలిసారి ధోనీ బ్యాటింగ్ చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఆ క్షణమే అతనో గొప్ప క్రికెటర్ అవుతాడనిపించింది. ప్రపంచం ఓ శక్తివంతమైన ఆటగాడిని చూడబోతుందని భావించా. అసాధారణమైన పొజిషన్‌లో అతను బంతిని అలవోకగా హిట్ చేసేవాడు. నేను చూసిన ఆటగాళ్లలో అతను అత్యంత శక్తివంతమైన బ్యాట్స్ మన్.' అని చాపెల్ ఓ చాట్‌సెషన్‌లో చెప్పుకొచ్చాడు.

ఆ ఇన్నింగ్స్ మరవలేనిది..

ఆ ఇన్నింగ్స్ మరవలేనిది..

‘శ్రీలంకపై ధోనీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ 183 నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో అతని హిట్టింగ్‌కు నేను ఫిదా అయ్యాను. మరుసటి మ్యాచ్ పుణెలో ఉంది. నేను అప్పుడు ధోనీని ‘ఎందుకు ప్రతీ బంతిని హిట్ చేస్తూ బౌండరీకి తరలించాలనుకుంటున్నావు? మైదానం నలువైపుల ఎందుకు ఆడటం లేదు'అని అడిగాను. దాంతో పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో తన ఆటకు భిన్నంగా ఆడాడు.

260 పరుగుల లక్ష్యచేధనలో మేం మంచి స్థితిలో నిలిచాం. అప్పుడు 12వ ఆటగాడైన ఆర్పీ సింగ్‌ సాయంతో సిక్స్‌లు కొట్టాచ్చా? అని నా అనుమతి అడిగాడు. నేను లక్ష్యం సింగిల్ డిజిట్ చేరేవరకు భారీ షాట్లు ఆడవద్దని చెప్పా. మరో 6 పరుగులు చేస్తే గెలుస్తామనంగా ధోనీ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను పూర్తి చేశాడు.'అని చాపెల్ గుర్తు చేసుకున్నాడు.

అతని ముఖంలో చిరునవ్వు..

అతని ముఖంలో చిరునవ్వు..

‘మ్యాచ్‌ను ముగించే విషయంలో నేనేప్పుడు ధోనీకి సవాల్ విసిరేవాడిని. మ్యాచ్ గెలవడానికి గల పరుగులు చేసినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కనిపించేంది. ఖచ్చితంగా నేను చూసిన ఆటగాళ్లలో అతనో అత్యుత్తమ ఫినిషర్'అని చాపెల్ కొనియాడాడు.

ఆస్ట్రేలియా తరఫున 87 టెస్ట్‌లు, 74 వన్డేలు ఆడిన చాపెల్.. 2005లో భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంత‌రం అప్ప‌టి కెప్టెన్ సౌర‌వ్ గంగూలీతో వచ్చిన పొర‌పొచ్చుల కార‌ణంగా కోచ్‌ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా త‌ప్పుకున్నాడు.

అతని కోచింగ్ పట్ల నాటి సీనియర్ ప్లేయర్లు జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ కూడా విముఖత వ్యక్తం చేశారు. ఇక గంగూలీని జట్టు నుంచి తప్పించడంపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది.

హిందూ దేవాలయం సందర్శించి మరీ.. సాయం చేసిన అఫ్రిది!

Story first published: Wednesday, May 13, 2020, 21:26 [IST]
Other articles published on May 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+