For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహులా మిడిలార్డర్ వద్దు.. ఓపెనింగే ముద్దు : గంభీర్

India Vs New Zealand 1st ODI : KL Rahul Should Open The Innings In ODIs Too - Gautam Gambhir
 Gautam Gambhir suggests KL Rahul should open the innings for India in ODIs too


న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం స్వింగ్‌‌లో ఉన్నాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అదరగొడుతున్నాడు.
శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్.. ఇలా దేశం ఏదైనా.. వేదిక మరేదైనా.. ఆఖరి జట్టులో తన బాధ్యత మారినా.. తన జోరుమాత్రం ఆగడం లేదు. మిడిలార్డర్‌లో వచ్చినా.. కీపింగ్ చేసినా.. ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. ఆఖరి కెప్టెన్సీ చేసినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ జట్టుకు అన్నీ తానై నడిపిస్తున్నాడు.
 మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా..

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా..

శిఖర్ ధావన్ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. వన్డే సిరీస్‌లో మాత్రం మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నా రాహుల్‌తో మరిన్ని ప్రయోగాలు చేయాలని ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యకు చెక్‌పెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది.

ఇదేం గొప్ప నిర్ణయం కాదు..

ఇదేం గొప్ప నిర్ణయం కాదు..

అయితే ఓపెనింగ్‌లో అదరగొడుతున్న రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం గొప్ప నిర్ణయం కాదని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్‌ను ఓపెనర్‌గానే కొనసాగించాలని తొలి వన్డే‌కు ముందు ఓ జాతీయ దినపత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.‘టాపార్డర్‌ నుంచి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించడం గొప్ప నిర్ణయమని ఖచ్చితంగా చెప్పలేను. కానీ భారత్ ఓపెనర్లుగా రాహుల్-మయాంక్ అగర్వాల్‌ను పంపితే రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రావచ్చు. రాహుల్ విలువైన ఆస్తి . అతన్ని బాగా చూసుకోవాలి. వికెట్ల వెనుకాల అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. దీన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో కీపింగ్ చేస్తాడని మాత్రం అనుకోవడం లేదు.'అని గంభీర్ పేర్కొన్నాడు.

పంత్ అనూహ్య గాయంతో..

పంత్ అనూహ్య గాయంతో..

ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్‌ను అందుున్న రాహుల్.. ఆ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో వచ్చిన రాహుల్ 47 పరుగులతో.. రెండో వన్డేలో ఐదో స్థానంలో వచ్చి 80 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 19 పరుగులే చేసినా కీపింగ్‌లో అదరగొట్టాడు. రివ్యూ విషయంలో కోహ్లీకి అండగా ఉంటూ.. మెరుపు రనౌట్లు, స్టంపౌట్లతో లెజెండ్ ధోనిని గుర్తు చేశాడు. దీంతో అతన్ని కీపర్‌గా కొనసాగిస్తే మరో బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవచ్చని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. దీంతోనే ఐదు టీ20ల సిరీస్‌కు, తాజాగా జరుగుతున్న తొలి వన్డేకు అతన్నే కీపర్‌గా కొనసాగించింది.

India vs Pakistan: భారత్ నయా చరిత్ర.. సెమీస్ గెలుపుతో నమోదైన రికార్డులివే

అనుమానాల్నీ పటా పంచల్..

అనుమానాల్నీ పటా పంచల్..

గంభీర్ తన కాలమ్‌లో పేర్కొన్న అనుమానాలన్నిటిని పటాపంచల్ చేస్తూ రాహుల్ మిడిలార్డర్‌లో అదరగొట్టాడు. కోహ్లీ ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ (64 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 88) అజేయ హాఫ్ సెంచరీతో భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. తనకు టాపార్డర్.. మిడిలార్డర్.. అంటూ ఏ ఆర్డర్‌తో సంబంధం లేదని తన విధ్వంసంతోనే క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు.

కివీస్‌కు భారీ లక్ష్యం..

కివీస్‌కు భారీ లక్ష్యం..

భారత బ్యాట్స్‌మెన్ జోరు ముందు కివీస్ బౌలర్లు మరోసారి తేలిపోయారు. క్రీజులోకి ప్రతీ బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి సెంచరీ‌తో మెరవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

Story first published: Wednesday, February 5, 2020, 13:38 [IST]
Other articles published on Feb 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+