న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ రన్స్ చేయడం కాదు.. రోహిత్, ధోనీలా ట్రోఫీలు గెలవాలి: గౌతమ్ గంభీర్

Gautam Gambhir says Virat Kohlis biggest challenge will be to win IPL 2020 or reach playoffs rather than scoring runs

న్యూఢిల్లీ: పరుగులు చేయడం కన్నా జట్టుకు టైటిల్ అందిచడం చాలా ముఖ్యమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ నాలుగు టైటిళ్లు గెలిస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడని గుర్తు చేశాడు. గత 8-9 ఏళ్లుగా ఆర్‌సీబీని నడిపిస్తున్న కోహ్లీ వ్యక్తిగతంగా పరుగులు చేసినా.. ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడని విమర్శించాడు. కనీసం ఈ సీజన్‌లోనైనా టైటిల్ తీసుకురావాలన్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షో‌లో పాల్గొన్న గంభీర్.. కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు.

ఈసారి బాగుంది..

ఈసారి బాగుంది..

‘ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి సమతూకమైన జట్టు ఉంది. అంతకుముందు ఆ జట్టు ఎప్పుడూ బ్యాటింగ్‌పైనే ఆధారపడేది. బౌలింగ్‌లో బలహీనంగా ఉండేది. కానీ ఈ సారి ఆ బలహీనతలను అధిగమించేలా టీమ్‌మెనేజ్‌మెంట్ జట్టు సమతూకంగా ఉండేలా జాగ్రత్త‌లు తీసుకుంది. ఆల్‌రౌండర్స్‌‌ను జట్టులోకి తీసుకొని బౌలింగ్ బలం పెంచుకుంది.

ఆరోన్ ఫించ్ రాక కూడా ఆర్‌సీబీకి కలిసి రానుంది. అయితే విరాట్ కోహ్లీ ముందున్న అతిపెద్ద సవాల్ ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ గెలవడమే.

అంతిమ లక్ష్యం టైటిలే..

అంతిమ లక్ష్యం టైటిలే..

ఇప్పటికే రోహిత్ శర్మ నాలుగు సార్లు, ధోనీ మూడు సార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. కోహ్లీ మాత్రం గత 8-9 ఏళ్లుగా ఆర్‌సీబీని నడిపిస్తూ ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. వ్యక్తిగతంగా అతను పరుగులు చేయవచ్చు. ఈ సారి కూడా రాణిస్తుండవచ్చు. కానీ ఓ ఆటగాడిగా.. కెప్టెన్‌గా అంతిమ లక్ష్యం టైటిల్ గెలవడమే ముఖ్యం.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లీ వ్యక్తిగతంగా చెలరేగుతున్నా టీమ్‌ను నడిపించడంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా క్లిష్ట స్థితుల్లో తడబడుతున్నాడు. గత సీజన్‌లో కూడా ఆ జట్టు తరఫున హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచిన విరాట్.. జట్టుకు మాత్రం విజయాలందించలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్ కొన్ని సూచనలు చేశాడు.

పరుగులు చేయడం కాదు..

పరుగులు చేయడం కాదు..

‘ఏ కెప్టెన్‌ను అయినా 700 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం ఇష్టమా..? లేక టైటిల్ గెలవడం ముఖ్యమా? అని అడిగితే ఎవరైనా చాంపియన్‌గా నిలవడమే కావాలంటారు. 500 పరుగులు చేసినా సరే కానీ జట్టుకు టైటిల్ అందించం ముఖ్యం అని చెబుతారు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే ఎవరైనా 500 నుంచి 700 పరుగులు సులువుగా చేయగలుగుతారు. ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ కూడా రన్స్ చేస్తున్నాడు. కానీ అతను ముందున్న అతిపెద్ద సవాల్ పరుగులు చేయడం కాదు. జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చడం, టైటిల్ అందించడమే'అని గంభీర్ పేర్కొన్నాడు.

ధోనీని చూసి నేర్చుకో..

ధోనీని చూసి నేర్చుకో..

ఇక విరాట్‌ కోహ్లీకి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని, అందుకే తరుచూ ఆటగాళ్లను మార్చేవాడని గంభీర్ గుర్తు చేశాడు. ఈ విషయంలో ధోనీని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుంది. కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మారుస్తూ ముందుకు వెళ్తుంది. ఇదే ధోనీ-కోహ్లీ సారథ్యంలో ఉన్నా ప్రధాన తేడా. అటు సీఎస్‌కే సక్సెస్‌‌కు.. ఇటు ఆర్‌సీబీ వైఫల్యానికి కూడా ఇదే కారణం. మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రికెటర్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుంది. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్‌సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉంచి నిలకడ కోసం ప్రయత్నించాలి.'అని గంభీర్ సూచించాడు.

నువ్వు తోపు బాసు.. నీ బౌలింగ్‌కు స్టంప్ గాల్లో పల్టీలు కొట్టి మరి నిలబడింది! (వీడియో)

Story first published: Tuesday, September 15, 2020, 20:12 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X