Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆండ్రీ రస్సెల్ విధ్వంసాన్ని అడ్డుకునేది ఆ బౌలరే: గౌతమ్ గంభీర్

Gautam Gambhir says There might be two or three bowlers who can trouble Andre Russell in IPL 2020

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను అడ్డుకునేది ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడేనని భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ సీజన్‌లో అతనితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా రస్సెల్‌పై పైచేయి సాధించ వచ్చని తెలిపాడు. 'ఈ సీజన్ ఐపీఎల్‌లో రస్సెల్‌ను ఇద్దరు లేదా ముగ్గురు బౌలర్లు ఇబ్బందిపెట్టవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రాలా రస్సెల్‌ను ట్రబుల్ చేసిన బౌలర్లను ఇప్పటి వరకైతే నేను చూడలేదు.'అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్‌ కనెక్టెడ్ షో లో గంభీర్ చెప్పుకొచ్చాడు.

ముందు దానిపై ఫోకస్ పెట్టండి..

ముందు దానిపై ఫోకస్ పెట్టండి..

ఇక ఈ సీజన్‌లో రస్సెల్‌ను టాపార్డర్‌లో పంపించాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. అతన్ని మూడో స్థానంలో పంపితే డబుల్ సెంచరీ కూడా చేయగలడని ఆ జట్టు మెంటార్ డెవిడ్ హస్సీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ నిర్ణయాన్ని గంభీర్ వ్యతిరేకించాడు. ఐదు, ఆరు స్థానాల కన్నా ముందు రస్సెల్‌ను పంపించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నాడు. ఈ ఆలోచను పక్కనపెట్టి సూపర్ ఫామ్‌లో ఉన్న మోర్గాన్, రస్సెల్‌ సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై దృష్టిసారించాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ అయిన గంభీర్ సూచించాడు.

రస్సెల్‌ను ఆపడం కష్టం..

రస్సెల్‌ను ఆపడం కష్టం..

‘ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉంటే క్వాలిటీ ఆఫ్ క్రికెట్, క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అనే వాటితో పెద్దగా పని ఉండదు. కానీ ఆండ్రీ రస్సెల్ ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు. అతని కాన్ఫిడెన్స్ హైలో ఉంటే రస్సెల్ ముందు ఏ బౌలర్ పనికిరాడు. ఇలా సూపర్ ఫామ్‌లో ఉన్న ఇయాన్ మోర్గాన్, రస్సెల్‌ను కేకేఆర్ ఎలా వాడుకుంటుందో చూడాలి. అద్భుత ఫామ్‌లో ఉన్న ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు.. పైగా లెఫ్ట్ , రైట్ కాంబినేషన్‌లో అందుబాటులో ఉండటం కోల్‌కతాకు ప్లస్.

ఆరు బంతులు చాలు..

ఆరు బంతులు చాలు..

కేకేఆర్ రస్సెల్‌ను ఐదోస్థానానికి ముందు పంపించాల్సి అవసరం లేదు. ఏ స్థానంలో వచ్చామనేది పెద్ద విషయమే కాదు. ఓవర్లతో సంబంధంలేదు. టీ20 క్రికెట్‌లో 6 బంతులే మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. కాబట్టి మంచి ఆరంభం లభించినప్పుడు రస్సెల్‌ను మోర్గాన్ కన్నా ముందు పంపించినా ఏం కాదు. అప్పుడు అతన్ని నాలుగు, ఐదులో ఆడించవచ్చు. కానీ అలా కాకుండా మెరుగైన ఆరంభం లేకుండా బరిలోకి దింపితే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

పొలార్డ్ చెలరేగాలంటే...

పొలార్డ్ చెలరేగాలంటే...

ఇక కరీబియన్ గడ్డపై చెలరేగుతున్న వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్.. ఐపీఎల్‌లో రాణించాలంటే అతన్ని ముందుగా బ్యాటింగ్ పంపించాలన్నాడు. ‘సీపీఎల్‌ ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కీరన్ పొలార్డ్‌ కొనసాగించాలంటే.. అతడ్ని మునుపటిలా నెం.5 లేదా నెం.6 మాత్రం బ్యాటింగ్‌కి పంపకూడదు. మంచి దూకుడు మీదున్న పొలార్డ్‌ను కాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపితే అదే జోరుని కొనసాగించలడు. మరి చూడాలి ముంబయి ఇండియన్స్ అతడ్ని ఏ స్థానంలో ఆడిస్తుందో..?'' అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

బిగ్‌ బాష్ లీగ్‌లో యువరాజ్ సింగ్?

Story first published: Tuesday, September 8, 2020, 12:13 [IST]
Other articles published on Sep 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+