న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ గాయంపై కోహ్లీకి అప్‌డేట్ ఇవ్వకుండా రవిశాస్త్రి ఏం చేస్తుండు.. గౌతం గంభీర్ ఫైర్!

Gautam Gambhir says ‘The head coach should have updated Virat Kohli on that front’
Ind vs Aus 2020 : Ravi Shastri Should Have Updated Kohli On Rohit Sharma's Injury - Gambhir Gambhir

రోహిత్‌ శర్మ గాయం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ఆటగాడి ఫిట్‌నెస్ గురించి టీమ్ కెప్టెన్‌కు సమాచారమివ్వకుండా హెడ్ కోచ్, హెడ్ ఫిజియో, చీఫ్ సెలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. కెప్టెన్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వీరిపైనే ఉందన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి రోహిత్ శర్మ గాయానికి సంబంధించిన అప్‌డేట్ విరాట్ కోహ్లీకి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డాడు.

అప్‌డేట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు..

అప్‌డేట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు..

తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడిన గంభీర్.. జట్టులో ఇలాంటి వాతావరణం ఉండటం దురదృష్టకరమన్నాడు. ‘ఓ కెప్టెన్ మీడియా కాన్ఫరెన్స్‌లో ఆటగాడి గాయంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం దురదృష్టకం. ఈ అనిశ్చితికి టీమ్ హెడ్ ఫిజియో, హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టరే కారణం. వీరే విరాట్ కోహ్లీకి సమాచారం ఇవ్వాల్సింది. ముఖ్యంగా టీమ్ హెడ్ కోచ్‌‌ రోహిత్ ఫిట్‌నెస్ గురించి విరాట్‌తో మాట్లాడాల్సింది.

 ఇలా చెప్పడం బాలేదు..

ఇలా చెప్పడం బాలేదు..

అలా కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ గాయం గురించి తెలియదని, ఎలాంటి అప్ డేట్ లేదని చెప్పడం ఏ మాత్రం బాలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మ చాలా ముఖ్యమైన ఆటగాడు. అలాంటి ఆటగాడి పట్ల చాలా హుందాగా వ్యవహరించాలి. మంచి కమ్యూనికేషన్, కో ఆర్డినేషన్ కలిగిఉండాలి. లేకుంటే ఆటగాళ్ల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయనే సందేహాలు కలుగుతాయి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ ప్రస్తుతం ఎన్‌సీఎలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

నాకెలాంటి సమాచారం లేదు..

నాకెలాంటి సమాచారం లేదు..

ఇక రోహిత్ గాయం వ్యవహారం ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డే ముందు విరాట్ కోహ్లీ అన్నాడు. ‘దుబాయ్‌లో సెలక్షన్‌ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్‌ వచ్చింది. ఐపీఎల్‌లో గాయపడిన కారణంగా రోహిత్‌ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్‌ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్‌ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. కానీ అది జరగలేదు. మాతో రోహిత్‌ ఎందుకు ప్రయాణించ లేదో మాకెవరికీ సమాచారం లేదు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

'క్రికెట్‌లో అది చట్టవిరుద్ధమైనది.. ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి'

Story first published: Wednesday, December 2, 2020, 15:54 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X